కొత్త ‘బాల’ జోరు ‘భలేగుందిగా’…

టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌ ఎప్పుడు బిజీ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఓ వెలుగు వెలుగుతూ హఠాత్తుగా ఫేడౌట్‌ అయిపోతుంటారు. కొంతమంది ఒక్క సినిమాకే పరిమితమైపోతున్నారా అనుకున్నప్పుడు అవకాశాలు వచ్చేస్తుంటాయి. అలాంటివారిలో పూజా హెగ్డే ఇటీవల ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమెలానే మరో అమ్మాయి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు సంపాదిస్తోంది. ఆమెనే నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌. ఆ సినిమా విడుదలయ్యాక… ‘ఈ అమ్మాయి భలే ఉందే’ అనుకున్నారు. వరుస అవకాశాలు కూడా వస్తాయి అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతోంది.

‘గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత సుమారు 9 నెలల గ్యాప్‌లో ప్రియాంకకు పెద్ద అవకాశాలు రాలేదు. ఇక అయిపాయ్‌ అనుకుంటున్న తరుణంలో శర్వానంద్‌ ‘శ్రీకారం’లో ఛాన్స్‌ కొట్టేసింది. ‘భలేగుంది బాలా…’ అంటూ ఆమె మీద రిలీజ్‌ అయిన పాట కూడా అదరగొడుతోంది. ఇప్పుడు ఈ భామ జోరు మొదలైంది. రవితేజ ‘ఖిలాడీ’లో ప్రియాంకను ఓ నాయికగా తీసుకుంటున్నారట. అధికారికంగా సమాచారం రానప్పటికీ… ఆమెనే ఫైనల్‌ అని సమాచారం. అంతే కాదు ఈ సినిమాలో మరో నాయికకు కూడా ఛాన్స్‌ ఉందట. అయితే అది స్పెషల్‌ సాంగ్‌. ఆ నాయిక కేథరిన్‌ అని అంటున్నారు.

ఇదిలా ఉండగా… ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్‌ ఇటీవల మొదలయ్యాయి. చెన్నైలో దేవిశ్రీప్రసాద్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్‌ వర్మ ఓ ఫొటో ట్వీట్‌ చేశాడు. మరోవైపు రవితేజ రీసెంట్‌ మూవీ ‘క్రాక్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అంటే ‘ఖిలాడీ’ ప్రారంభానికి ఎక్కువ రోజులు లేదనే అర్థం. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ‘క్రాక్‌’ విడుదల చేస్తారు. అక్కడికి కొద్ది రోజులకే ‘ఖిలాడీ’ కూడా వచ్చేస్తుందన్నమాట.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus