అప్పుడు మెగాస్టార్‌కి..ఇప్పుడు నానికి..!
- September 28, 2016 / 02:14 PM ISTByFilmy Focus
తనదైన సహజ నటనతో వరుస సూపర్‌హిట్లు ఖాతాలో వేసుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా నాని నటించిన మజ్ను ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 6.27 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిందట. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మజ్ను విడుదలకు ముందు విడుదల తర్వాత ఏపీ, తెలంగాణల్లో ఒకటే వానలు. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు.
















