సినిమాలు – క్రికెట్.. ఈ రెండింటి మధ్య సంబంధం గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ రెండు రంగాల వాళ్లు పెళ్లి చేసుకుంటున్నప్పుడల్లా ఈ చర్చ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరోవైపు సినిమా వాళ్లు మైదానానికి వెళ్లి సినిమా ప్రచారం కూడా చేస్తుంటారు. తాజాగా నాని తన పాన్ ఇండియా సినిమా ‘దసరా’ను ప్రమోట్ చేయడానికి భారత్ – ఆస్ట్రేలియా రెండో వన్డేకు వెళ్లాడు. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లకు ఆసక్తికర పేర్లు పెట్టాడు.
నాని త్వరలో ‘ధరణి’ అవతారం ఎత్తి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ‘దసరా’ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని ఆదివారం క్రికెట్ కామెంటటర్‌తో మాట్లాడాడు. అప్పుడే టమ్ ఇండియా స్టార్ ప్లేయర్ల గురించి తన ఆలోచనలు చెప్పుకొచ్చాడు. అలాగే వారికి తన సినిమా పేర్లలో ఏది బాగుంటుంది అనే విషయాన్ని చెప్పాడు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘జెంటిల్‌మెన్’ సినిమా టైటిల్ ఇచ్చాడు నాని. ఆ తర్వాత విరాట్ కోహ్లీకి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా టైటిల్ బాగుంటుందని చెప్పాడు. హార్దిక్ పాండ్యకి ‘పిల్ల జమిందార్’ మూవీ టైటిల్ అయితే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు, సినిమా టైటిల్స్ చెబుతున్నప్పుడు మైదానంలో ప్రేక్షకులు సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా విరాట్‌ను గ్యాంగ్ లీడర్ అనేసరికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని నానిని అడిగితే.. సచిన్ టెండుల్కర్ పేరు చెప్పాడు. సచిన్ ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పిన నాని.. ఆ రోజుల్లో అతను ఔట్ అయ్యాక టీవీలు కట్టేసేవాళ్లమని, మ్యాచ్ చూసేవాళ్లం కాము అని చెప్పాడు నాని. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్‌కు ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్..’ సిగ్నేచర్ స్టెప్‌ను నేర్పించాడు. ఇలా నాని సందడి వైజాగ్‌లో భలేగా సాగింది అని చెప్పాలి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?