Hero Nani: క్రేజీ డైరెక్టర్ తో మరో హిట్ కొట్టడానికి సిద్ధమైన నాని?

నాచురల్ స్టార్ నాని ఎలాంటి సినీ నేపథ్యంలేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఇతనికి వరుస అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అంటే సుందరానికి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన నాని తదుపరి అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ, ఈ సినిమా తర్వాత దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా అనంతరం నాని మరొక క్రేజీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నాని సినీ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన భలే భలే మగాడివోయ్ వంటి సినిమాని అందించిన డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నాని మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పెద్దఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం మారుతి ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మారుతి సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో ఈలోగా మారుతి నానితో సినిమా చేయాలని భావించారట.

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులను కూడా శరవేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాలు కూడా మంచి హిట్ కొట్టాయి. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో నాని సినిమా రాబోతుందని తెలియడంతో ఈ సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus