Nani: నానికి అసలు టైం దొరకడం లేదుగా!

నేచురల్ స్టార్ నానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. అయితే కొన్నాళ్లుగా ఆయన సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అంటే సుందరానికీ!’ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ప్రస్తుతం ఆయన ‘దసరా’ సినిమాలో నటిస్తున్నారు. ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాపై బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. 2023, మార్చి 30న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా సినిమా వర్క్ జరుగుతుంది. ఇప్పటివరకు నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. నాని అయ్యప్పమాల వేసుకోవడంతో కొంతకాలం షూటింగ్ ఆపేశారు. తిరిగి ఈ వారంలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అయితే ఇంతలో నానికి మరో రెండు అదనపు బాధ్యతలు తోడయ్యాయి.

అందులో మొదటిది సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించిన వెబ్ యాంథాలజీ ‘మీట్ క్యూట్’ ఈ నెల 25న సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీని నిర్మాణ బాధ్యతలు నాని చూసుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్ లో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. మరోపక్క తాను నిర్మించిన ‘హిట్2’ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అడివి శేష్ హీరోగా నటించారు. ఆయనతో పాటు నాని కూడా పబ్లిసిటీలో భాగమవుతున్నారు. అలా హీరోగా, నిర్మాతగా చాలా బిజీగా గడుపుతున్నారు నాని. మరి హీరోగా సక్సెస్, నిర్మాతగా లాభాలు అందుకుంటారేమో చూడాలి!

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus