Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

నాచురల్ స్టార్ నాని (Nani)   టాలీవుడ్‌లో సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తున్నాడు. పాన్ఇండియా సినిమాలతో స్టార్ హీరోలు దూసుకెళ్తున్నప్పటికీ, నాని తన మార్కెట్‌ను సమర్థవంతంగా వాడుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇటీవల ‘హిట్ 3’తో  (HIT 3) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న నాని, కేవలం క్రైం థ్రిల్లర్ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా, సామాన్య సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కథ, నటనతో అది జస్టిఫై అయ్యేలా చేసి మంచి మార్కులు కొట్టేశాడు.

Nani:

ఇప్పుడు నాని 2026లో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘ప్యారడైజ్’  (The Paradise)  సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ చేసింది, 2026 మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. నాని రిలీజ్ డేట్‌ను లాక్ చేసినప్పుడు, ఆ షెడ్యూల్‌ను ఖచ్చితంగా అనుసరించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ‘ప్యారడైజ్’ సినిమా నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

‘ప్యారడైజ్’ తర్వాత నాని సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ 2025లోనే ప్రారంభం కానుంది, 2026 చివరి నాటికి విడుదల చేసేలా నాని షెడ్యూల్ సెట్ చేసుకున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, నాని ఎనర్జీని ఉపయోగించుకుని సుజిత్ మరో హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. నాని ఈ రెండు సినిమాలతో 2026లో బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద టార్గెట్లను సెట్ చేసుకున్నాడు.

‘హిట్ 3’ సక్సెస్ తర్వాత అతని కెరీర్‌లో ఈ సినిమాలు మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ‘ప్యారడైజ్’ సినిమా శ్రీకాంత్ ఓదెల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో రావడం, సుజిత్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడం నాని ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాని ఎప్పుడూ తన సినిమాలతో వైవిధ్యమైన అనుభవాన్ని అందిస్తాడు, ఈసారి కూడా అదే జోరును కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నాడు. 2026లో ఈ రెండు సినిమాలు నాని కెరీర్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తాయని చెప్పవచ్చు. మరి ఆ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ను ఇంకా ఏ స్థాయిలో పెంచుతాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus