విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ రేపు అనగా జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిజల్ట్ కోసం చాలా మంది స్టార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండకి మంచి హిట్ పడి దాదాపు 7 ఏళ్ళు కావస్తోంది. మధ్యలో ఒకటి, రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా.. మిగిలినవన్నీ చాలా నష్టాలు మిగిల్చాయి.
అయితే ‘కింగ్డమ్’ పై విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. విజయ్ ప్లాపుల్లో ఉన్నప్పటికీ అతని పై రూ.130 కోట్ల బడ్జెట్ పెట్టి ‘సితార..’ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. విజయ్ కి ఉన్న స్టార్ డమ్ ను బట్టి అతను ఇంత రిస్క్ చేశాడని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మార్చి 28నే ‘కింగ్డమ్’ రిలీజ్ కావాలి. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడం… పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పలు సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయడం వంటి వ్యవహారాల వల్ల మరింత ఆలస్యమైంది.
ఈ చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేశాడు. అతని శైలికి పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. అతని గత సినిమాలు ‘మళ్ళీ రావా’ ‘జెర్సీ’ చాలా క్లాస్ గా ఉంటాయి.ఈసారి అతను యాక్షన్ బాట పట్టాడు. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటివి చాలా బాగున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ఇదిలా ఉండగా.. ‘కింగ్డమ్’ రిజల్ట్ పై హీరో నాని కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేయడానికి నాని కమిట్ అయ్యాడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘జెర్సీ’ వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకుంది. అయితే అది పక్కా క్లాస్ మూవీ. ఈసారి మాత్రం నానితో ఓ యాక్షన్ మూవీ చేయాలని గౌతమ్ భావిస్తున్నాడట. ఆల్రెడీ నానికి గౌతమ్ కథ వినిపించడం… అతను కూడా ఓకే చెప్పడం జరిగిందట. కానీ ‘కింగ్డమ్’ హిట్ అయితేనే అది ఫాస్ట్ గా సెట్ అవుతుంది. అది మేటర్.