Nani: నాని విషయంలో దానయ్య తొందరపడ్డారా..?

టాలీవుడ్‌లో స్టెడీగా ఎదుగుతూ, కమర్షియల్ హిట్స్‌ను వరుసగా అందుకుంటున్న నాని (Nani), మరో విభిన్న యాక్షన్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడు. దసరా  (Dasara), సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) విజయాలతో 100 కోట్ల మార్కెట్ అందుకున్న నాని, ఇప్పుడు హిట్ 3 (HIT3), ది ప్యారడైజ్ (The Paradise) సినిమాలతో భారీగా రెడీ అవుతున్నాడు. అయితే, సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో నానితో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అనౌన్స్ చేశాడు, అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.

Nani

ఈ సినిమా మొదట డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మించాల్సి ఉంది. కానీ, సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) OG పూర్తిచేయాల్సిన పరిస్థితి ఉండటంతో, OG (OG Movie) ఆలస్యం కావడంతో, నాని ప్రాజెక్ట్ షెడ్యూల్ కూడా ముందుకు జరగలేకపోయింది. దానయ్య ఇప్పటికే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేయడంతో, నాని-సుజీత్ సినిమా రిస్క్ తీసుకోవడం ఇష్టపడలేదన్న టాక్ వినిపిస్తోంది. దాంతో, ఈ సినిమాను వెంకట్ బొల్లినేని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

నాని, వెంకట్ బొల్లినేని గతంలో శ్యామ్ సింగరాయ్ కోసం కలిసి పనిచేశారు. అయితే, వెంకట్ ఇటీవల సైంధవ్ (Saindhav) ఫెయిల్యూర్‌తో కొంత వెనకబడ్డాడు. కానీ, నాని‌తో ఈ సినిమాతో తిరిగి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. నిజానికి, OG హిట్ అయితే, సుజీత్ మార్కెట్ మరింత పెరుగుతుంది. అలాంటి టైమింగ్‌లో నాని ప్రాజెక్ట్ చేయడం హైప్‌ను డబుల్ చేసేది. అయితే, దానయ్య ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడా? అన్నదానిపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

కొంతమంది ట్రేడ్ అనలిస్టులు ఈ ప్రాజెక్ట్‌ హిట్ గ్యారంటీగా మారేదని, అయితే డీవీవీ దానయ్య దీనిపై తొందరపడి వెనుకడుగేశారని అంటున్నారు. నాని ఇప్పుడు వేరే లైన్‌లో వెళ్లిపోతే, ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. మొత్తానికి, ఇది ఒక మిస్ అవుట్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుందా? లేక కొత్త నిర్మాతతో మరింత భారీగా వెళ్తుందా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus