నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా.. తనకు నచ్చి.. తాను చేయలేకపోతున్న కథలను నిర్మాతగా మారి వేరే హీరోతో చేస్తుంటాడు. అలా హీరోగానే కాకుండా, నాని నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే నాని నిర్మాణంలో రూపొందిన ‘అ!’ ‘హిట్'(HIT) ‘హిట్ 2’ (HIT 2) వంటి సూపర్ హిట్లు ఇచ్చాడు. మరో 3 రోజుల్లో ‘కోర్ట్’ (Court) రిలీజ్ కానుంది.ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్ర పోషించిన మూవీ ఇది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాకి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేస్తున్నాడు.
మార్చి 12న ఈ సినిమాని మీడియాకి చూపించబోతున్నారు. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 13న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నాడు నాని. ‘కోర్ట్’ వంటి చిన్న సినిమాకి పుషింగ్ అవసరం. రిలీజ్ ముందే ప్రిమియర్స్ వేస్తున్నారు అంటే ఆడియన్స్ లో ఏదో తెలియని క్యూరియాసిటీ ఉంటుంది. దానికి తగ్గట్టు కథ కథనాలు ఉంటే.. రిలీజ్ రోజున ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఒకవేళ కంటెంట్ అనుకున్నట్టు లేదు అంటే అది పెద్ద రిస్క్ చేసినట్టు కూడా అవుతుంది.
నానికి ఇది తెలియనిది ఏమీ కాదు. కానీ నాని నమ్మకం ఇప్పటివరకు అబద్దం అనిపించింది లేదు. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఫలితాలు మారాయేమో కానీ.. నాని సినిమాలో ఉన్న కంటెంట్ గురించి బలంగా చెప్పాడు అంటే.. ఆ కంటెంట్ కచ్చితంగా ఉంటుంది. ‘ ‘కోర్ట్’ కనుక మీకు నచ్చకపోతే ‘హిట్ 3’ (HIT 3) సినిమాకి రావద్దు’ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే.. కచ్చితంగా నాని కాన్ఫిడెన్స్ కి తిరుగు లేదేమో అనిపిస్తుంది. చూడాలి మరి..!