ఆ విధంగా ఈ కథ నాని దగ్గరకు వచ్చిపడిందన్నమాట..!

నాని 24 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ పై మంచి అంచనాలే ఉన్నాయి. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లుంటారని టాక్ నడిచింది. ఇక ఈ చిత్ర కథ ఇదేనంటూ కూడా కొన్ని వార్తలొచ్చాయి. ఈ చిత్ర కథ ప్రకారం నాని, నలుగురు మహిళలు, ఓ విలన్ ఉంటారట. నాని రైటర్ గా నటిస్తాడట. ఆ నలుగురు మహిళలకు న్యాయం చేయడానికి నాని రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది. సినిమా ప్రారంభంలోనే నలుగురు మహిళల మర్డర్ ఎపిసోడ్ వుంటుందని… తరువాత దీని చుట్టూ… కథ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ చిత్ర కథ మహేష్ బాబు కోసం తయారు చేసిందంటూ ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్ర కథ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం తయారుచేసిందేనట. గతంలో అశ్వనీదత్-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో మహేష్ తో ఓ సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ జరిగింది. అనేక సంప్రదింపుల తరువాత స్క్రిప్ట వర్క్ పూర్తయ్యింది. ఈ కథలో విలన్ పాత్రను చాలా హై రేంజ్ లో తయారుచేసారట. ఎక్కువ ప్రాధాన్యత విలన్ కే ఉంటుందని సమాచారం. మహేష్ తన స్టార్ ఇమేజ్ కు ఈ చిత్రం సెట్ అవ్వదేమో అని పక్కన పెట్టాడట. దీంతో ఈ కథ గీతా ఆర్ట్స్ వద్దకు వెళ్ళింది. అక్కడ బన్నీ దగ్గర చాలా రోజులాగింది. కానీ చివరికి బన్నీ కూడా హ్యాండిచ్చాడు. దీంతో ఇక నానిని లైన్లో పెట్టాడు విక్రమ్ కుమార్. ఈ చిత్ర కథ కోసం అశ్వనీదత్ కు భారీగా కాంపన్ సేషన్ కూడా ఇచ్చారట నిర్మాతలు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ ను తీసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus