తెలుగు దర్శకులు – తమిళ హీరోలు కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో ఎలా పెరుగుతోందో… తమిళ దర్శకులు – తెలుగు హీరోలు కాన్సెప్ట్ కూడా అలానే కనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి తెలుగులో ఇటీవల కాలంలో రూపొందుతున్న సినిమాల్లో తమిళ దర్శకుల సినిమాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయాల శాతం పక్కనపెడితే సినిమాల శాతం పెరుగుతోంది. ఇప్పుడు ఎందుకు ఈ రెండు కాన్సెప్ట్‌లు అంటే.. మరో తెలుగు హీరో తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం.
దీంతో తెలుగు హీరో – తమిళ దర్శకుడు అనే చర్చ, తమిళ దర్శకులకు తెలుగులో హిట్ రేషియో ఎంత అనే చర్చ మళ్లీ మొదలయ్యాయి. ఎందుకు అంటే ఇప్పుడు సినిమా ఒప్పుకున్న హీరోకు గతంలో ఓ తమిళ సినిమా దారుణమైన పరాజయాన్ని ఇచ్చింది కాబట్టి. ఇక్కడ ఆ హీరో నాని అయితే.. ఆ దారుణమైన సినిమా ‘జెండాపై కపిరాజు’. ఈ విషయం పక్కనపెడితే నాని కొత్తగా ఓ తమిళ దర్శకుడి కథకు ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలోనే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
నాని (Nani) ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమాను ముగించే పనిలో ఉన్నాడు. త్వరలోనే సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసి… వివేక్ ఆత్రేయ సినిమాకు కొబ్బరికాయ కొడతారు అని చెబుతున్నారు. అయితే ఇటీవల నాని శిబి చక్రవర్తి అనే తమిళ దర్శకుడి కథ విన్నారట. స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉండటంతో నాని ఈ సినిమాకు పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కిస్తారు అని అంటున్నారు. అయితే ఒకేసారి, డబ్బింగా అనేది తేలుతుంది.
ఇక శిబి చక్రవరర్తి సంగతి చూస్తే… శివకార్తికేయన్‌తో ‘డాన్’ అనే సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా మారారు. గతేడాది వచ్చిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు నానితో తన రెండో సినిమా చేస్తారు అంటున్నారు. మరి ‘జెండా పై కపిరాజు’ రిపీట్ కాకుండా నాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. అన్నట్లు ఆ ‘జెండాపై కపిరాజు’ తీసింది మన ‘బ్రో’ డైరక్టర్ సముద్రఖనినే.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!