Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వెనుక ఉన్న కథని చెప్పుకొచ్చిన నాని..?

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వెనుక ఉన్న కథని చెప్పుకొచ్చిన నాని..?

  • May 6, 2020 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వెనుక ఉన్న కథని చెప్పుకొచ్చిన నాని..?

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఒక క్లాసిక్ అని సింపుల్ గా చెప్పేసినా సరిపోదు. టెక్నాలజీ పెరిగాక ‘బాహుబలి’ ‘రోబో’ వంటి విజువల్ వండర్స్ మనం చూస్తూ వస్తున్నాం. కానీ వాటిని మించి ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అని చెప్పడంలో ఏమాత్రం అతిసయోక్తి లేదు. ఎంతో కలర్ ఫుల్.. టెక్నాలజీ పెద్దగా అందుబాటులోలేని రోజుల్లో కూడా ఈ చిత్రాన్ని అంత రిచ్ గా ఎలా చిత్రీకరించారు. భయంకరమైన వర్షాలు.. ఇంట్లో నుండీ బయటకి రావడమే కష్టం అనుకుంటే… ఏకంగా ఆ వర్షంలో టికెట్ ల కోసం లైన్ లో నిలబడి.. థియేటర్ లో కాళ్ళ వరకూ నీళ్ళు వచ్చినా సరే సినిమాని ఎంజాయ్ చేసారట అప్పటి ప్రేక్షకులు. ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే 1990 మే 9 న విడుదల అయిన ఈ చిత్రం 2020 మే 9కి 30 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది.

అయితే ఈ ఇంత గొప్ప చిత్రం రూపొందించడానికి ముందడుగు ఎలా పడింది అనే సంగతులను మన నేచురల్ స్టార్ నాని తో చెప్పించి ఓ వీడియోలను రూపొందించారు ‘వైజయంతి మూవీస్’ వారు. అందులో ‘పార్ట్ 1’ వీడియోని తాజాగా విడుదల చేసారు. ఈ వీడియోకి నాని వాయిస్ ఓవర్ ఇస్తూ… ”బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ, జనరేషన్లు మారినా, ఎవర్ గ్రీన్ గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్ట్ లో ఫస్ట్ ఉండే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్రం ఎలా పుట్టింది? అశ్వినీదత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ ‘జగదేక వీరుని కథ’ లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవిగారితో చేయాలని, అది తను ప్రేమగా ‘బావ’ అని పిలుచుకునే రాఘవేంద్రరావుగారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట.’ఆఖరి పోరాటం’ తరువాత చిరంజీవిగారితో సినిమా చేయాలనుకున్నారు దత్తుగారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్, కో-డైరెక్టర్ అయిన శ్రీనివాస్ చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా, దత్తుగారి మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి, “దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది.

Nani voice over for Jagadeka Veerudu Athiloka Sundari flash back story1

అది చిరంజీవిగారికి దొరుకుతుంది” అని ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘవేంద్రరావుగారికి బాగా నచ్చింది. దత్తుగారి కలకు దగ్గరగా ఉంది. ఆయనకీ నచ్చింది. మరి జగదేకవీరుడికి అతిలోక సుందరిగా జోడీ ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే. వైజయంతీ ఆస్థాన నాయిక వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్టయ్యింది.దానికి తగిన కథను సిద్ధం చేయటానికి వైజయంతీ ఆఫీస్ లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు, జంధ్యాలగారితో మొదలై, సత్యమూర్తిగారు, విజయేంద్ర ప్రసాద్ గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్ గారు.. ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతేకాదు, చిరంజీవిగారు కూడా నెలరోజుల పాటు అక్కడకు వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవకన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడి లుక్ లో ఉంటేనే బాగుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు అని చిరంజీవిగారు సలహా ఇచ్చారు. ఇంకో వైపు… బాంబేలో తన కాస్ట్యూమ్స్ తానే కుట్టించుకోవడం మొదలు పెట్టారు శ్రీదేవిగారు. ఇలా అందరూ కలిసి తమ సమష్టి కృషితో ఈ అందమైన చందమామ కథను తెలుగు సినీ చరిత్రలో మర్చిపోలేని అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా అంత ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా? లేదు మానవా! ఇంకా చాలా జరిగింది. స్టే ట్యూన్డ్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రెండో పార్ట్ ను మే 7న విడుదల చేయనున్నారు.

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagadeka Veerudu Athiloka Sundari
  • #K Raghavendra Rao
  • #Megastar Chiranjeevi
  • #Sridevi

Also Read

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

related news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

trending news

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

7 hours ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

11 hours ago
Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

11 hours ago
Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

12 hours ago
Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

13 hours ago

latest news

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

15 hours ago
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

15 hours ago
బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

16 hours ago
Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version