నాని నటించిన డిజాస్టర్ సినిమాల్లో “పైసా” ఒకటి. దాదాపు సంవత్సరం పాటు వాయిదాపడి ఎట్టకేలకు విడుదలైన ఈ చిత్రంలో కథానాయకుడు నాని, కథానాయకి కేతరీన్ కంటే ఎక్కువగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్ సిద్ధికా శర్మది. అమ్మడి గ్లామర్, బికినీ ఫోజులు అప్పట్లో గట్టిగా హల్ చల్ చేశాయి. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అమ్మడు ఆరబోసిన అందాలన్నీ అడవి కాచిన వెన్నెల అయ్యాయి. దాంతో సిద్ధిక మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. మళ్ళీ దాదాపు ఆరేళ్ళ తర్వాత సిద్ధిక మళ్ళీ తెలుగులో కనిపించనుంది.
ఈ ఆరేళ్ళ గ్యాప్ లో సిద్ధికకి వేరే సినిమా అవకాశాలు కూడా రాలేదు. కాకపోతే.. అమ్మడు హాట్ మోడల్ కావడంతో ఇప్పటివరకూ ఫోటోషూట్స్ తో కాలాన్ని నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆమె తెలుగులో సైన్ చేసిన సినిమాలో హీరోగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్. ఓ యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో సిద్ధిక తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనుంది. మరి ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్లు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా సంపాదించుకోగలదో లేదో చూద్దాం.