HIT 3: నాని హిట్ 3.. డబుల్ సెంచరీ సాధ్యమేనా?

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న ‘హిట్ 3’  (HIT 3) సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంటే ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సినిమా మే 1న గ్రాండ్ గా విడుదల కానుంది. విశ్వక్ సేన్ తో  (Vishwak Sen)  మొదలైన హిట్ ఫ్రాంచైజీ.. అడివి శేష్‌తో  (Adivi Sesh) రెండో భాగంతో మరింత బలపడింది. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ పాత్రతో మూడో కేస్‌లో అడుగుపెడుతున్నారు. ట్రైలర్‌లోని యాక్షన్, డైలాగ్స్, బ్లడీ మూడ్ టోన్, నాని అగ్రెషన్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

HIT 3

హిట్ 3లో నాని క్యారెక్టర్ గత సినిమాలకంటే పూర్తిగా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో ఎన్నడూ లేని విధంగా హార్ష్ వైలెన్స్‌, డార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయి. సినిమాకు ఎమోషన్‌తో పాటు ఇంటెన్స్ మిస్టరీ కూడి ఉండటం ఇది పెద్ద ప్లస్ అవుతుంది. ప్రస్తుతం హిట్ 3 పై ఉన్న పాజిటివ్ బజ్ ట్రేడ్ వర్గాల్లోనూ ఆశాభావాన్ని కలిగిస్తోంది. నాని నటనకు తోడు నిర్మాతగా కూడా ఫుల్ కంట్రోల్ తీసుకుని ప్రమోషన్ పైన పెద్ద దృష్టి పెట్టారు.

అన్ని భాషల్లో ఓ మోస్తరు విడుదల లభించడంతో సినిమాకు రేంజ్ విస్తృతమైంది. బాక్సాఫీస్ వసూళ్లు విపరీతంగా వస్తే హిట్ 3 ఫ్రాంచైజీని మరో లెవెల్‌కు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద డబుల్ సెంచరీ అనే టాక్ వస్తోంది. విశ్వక్ హిట్ ఫస్ట్ కేస్ 12కోట్లకు పైగా గ్రాస్ తీసుకు వచ్చింది. ఇక రెండవసారి అడివి శేష్ 42కోట్ల గ్రాస్ తెచ్చింది. ఇక ఈసారి నాని హిట్ 3 సినిమా 100కోట్లను దాటి, కంటెంట్ క్లిక్కయితే 200 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

ఇటీవల నాని ‘దసరా’, (Dasara)  ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాలతో మంచి రిజల్ట్ చూపించగా.. హిట్ 3 పూర్తిగా మాస్, థ్రిల్లింగ్ కంటెంట్‌తో ఉండటం విశేషం. ఈ సినిమా హిట్ అయితే నాని కెరీర్‌లోనే మరో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తానికి నాని హిట్ 3 పై భారీ అంచనాలు ఉన్నా.. అసలైన జడ్జ్‌మెంట్ మాత్రం మే 1న థియేటర్లలోనే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మేటీరియల్ చూస్తే, హిట్ 3 నానిని మాస్ హీరోగా మళ్లీ రీ డిఫైన్ చేయడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus