Shyam Singha Roy Trailer: నానికి ఈసారి హిట్టు పడేలా ఉంది.. ట్రైలర్ అదుర్స్..!

మరో 10 రోజుల్లో నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘ట్యాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా… ‘నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్’ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సత్యదేవ్ జంగా జీవిత ఆధారంగా కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. మురళీ శర్మ, అభినవ్ గోమతం వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన పాత్రలు ప్రోమోలు, టీజర్ వంటివి సినిమా పై అంచనాలను పెంచాయి. మూడేళ్ళుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న నాని ఈ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ‘ఐ యామ్ వాసు.. ఫిమేల్ డైరెక్టర్.. సాఫ్ట్ వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను’ అంటూ నాని చెబుతున్న డైలాగులతో ట్రైలర్ మొదలైంది.

మరో పాత్రలో రైటర్ శ్యామ్ సింగ రాయ్ గా కనిపిస్తున్నాడు నాని. ‘వాడి గుడిసె జోలికి వెళ్ళావో, నీ ఇల్లు ఎక్కడ ఉందో ఈ శ్యామ్ సింగ రాయ్ కి బాగా తెలుసు’, ‘పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడుతారు… ఆత్మాభిమానం కన్నా ఏ యాగము గొప్పది కాదు తప్పని తెలిసాక దేవుడిని అయినా ఎదిరించడం లో తప్పే లేదు’ … అనే డైలాగులు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. కోల్ కతా నేపథ్యంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని…

సాయి పల్లవి ఓ దేవదాసిగా కనిపిస్తుంది. ఉప్పెన భామ కృతిశెట్టి అయితే సిగరెట్లు కాలుస్తూ, లిప్ లాక్ లు ఇస్తూ బోల్డ్ గా కనిపిస్తుంది. ట్రైలర్లో ఉన్న ఎమోషనల్ కంటెంట్,సినిమాలో కమర్షియల్ అంశాలు చాలానే ఉంటాయి అనే హింట్ ఇస్తుంది. ట్రైలర్ బాగుంది మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus