నారా రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత రోహిత్ కెరీర్లో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 2024 లో ‘ప్రతినిథి 2’తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనిలబడలేదు. తర్వాత ‘భైరవం’ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అది పర్వాలేదు అనిపించింది. తర్వాత హీరోగా ‘సుందరకాండ’ చేశాడు. అది కూడా పర్వాలేదు అనే రేంజ్లో ఆడింది.
ఇలా హీరోగానే కాకుండా పెద్ద సినిమాల్లో కూడా స్పెషల్ రోల్స్ చేయడానికి రెడీ అయినట్టు ‘సారొచ్చారు’ ‘భైరవం’ వంటి సినిమాలతో చెప్పకనే చెప్పాడు నారా రోహిత్. ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేయడానికి రెడీ అయినట్టు టాక్.వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం- AK47’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఒక సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర ఉందట. అది పోలీస్ ఆఫీసర్ రోల్ అని టాక్. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఆ ముఖ్య పాత్ర కోసం కొంత ఇమేజ్ ఉన్న హీరో అయితే బెటర్ అని.. త్రివిక్రమ్ భావించారట. ఇక దాని కోసం ఇటీవల హీరో నారా రోహిత్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. రోహిత్ కి కూడా ఈ పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు టాక్.
గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో సుశాంత్ కూడా కీలక పాత్ర పోషించారు.
