విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చేసిన ‘నారప్ప’ టీం..!

విక్టరీ వెంకటేష్ 74 వ చిత్రంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అప్- కమింగ్ మూవీ ‘నారప్ప’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కలైపులి ఎస్ ధను తో కలిసి డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది.తమిళంలో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్ పోషిస్తున్నాడు. నిజానికి గతేడాదే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావించారు కానీ కరోనా లాక్ డౌన్ వలన థియేటర్లు మూత పడటంతో అది సాధ్యం కాలేదు.

అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. సమ్మర్ కానుకగా మే14న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు ‘నారప్ప’ టీం ఖరారు చేశారు. కచ్చితంగా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇతను అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని కూడా స్పష్టమవుతుంది.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు మరియు గ్లింప్స్ వంటి వాటికి మంచి స్పందన లభించింది. దాంతో సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగాయని చెప్పొచ్చు. ‘ఎఫ్2’ ‘వెంకీమామ’ వంటి వరుస విజయాలతో ఫామ్లో ఉన్న వెంకటేష్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కంప్లీట్ చెయ్యడం ఖాయమని.. అభిమానులు ఆశిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus