Narasimha Naidu: దేవుడా.. నరసింహ నాయుడు ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ టైటిల్ భగవంత్ కేసరి అని ఫిక్స్ అయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. బాలయ్య అనిల్ కాంబో మూవీ నుంచి గ్లింప్స్ కూడా విడుదల కానుందని ఈ నెల 10వ తేదీన గ్లింప్స్ రిలీజ్ అవుతుందని సమాచారం అందుతోంది. మరోవైపు బాలయ్య పుట్టినరోజు కానుకగా నరసింహ నాయుడు మూవీ రీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో రీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు (Narasimha Naidu) బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. ఈ సినిమా రీరిలీజ్ అవుతున్నా పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం మైనస్ అవుతోంది. భ్రమరాంబ, దేవి థియేటర్లలో మాత్రం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. బాలయ్య పుట్టినరోజు సమయానికి బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అయితే గతంలో రీ రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో కొన్ని సినిమాలు కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆ సినిమాల స్థాయిలో నరసింహ నాయుడు సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చుడాలి.

బాలయ్య ఈ సినిమాను ప్రమోట్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నరసింహ నాయుడు మూవీ అప్పట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిన్నికృష్ణ అందించిన కథ ఈ సినిమాకు ప్లస్ అయింది. బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ప్రమోషన్స్ లో కొంతమేర వేగం పెంచితే మాత్రం నరసింహ నాయుడు కలెక్షన్లు వేరే లెవెల్ లో ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. నరసింహ నాయుడు మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నరసింహ నాయుడు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus