నరేష్ – పవిత్ర అప్పుడే హనీమూన్‌కి వెళ్లిపోయారా?..వైరల్ అవుతున్న ట్రిప్ వీడియోలు..!

సీనియర్ నటులు వీకే నరేష్ – పవిత్ర మరోసారి ఫిలిం వర్గాలతో పాటు జనాల్లోనూ హాట్ టాపిక్‌గా మారారు.. రీసెంట్‌గా వివాహబంధంతో ఒక్కటయ్యారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. నరేష్ – పవిత్రల మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరంలేదు. చాలా కాలంగా వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. నరేష్ – పవిత్ర తమ రిలేషన్ గురించి 2022 డిసెంబర్ 31న ఓ వీడియో ద్వారా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వీడియోలో నరేష్ – పవిత్ర లిప్ లాక్ పెట్టుకోవడం. లేటు వయసులో వీళ్ళ రొమాన్స్ చూసి ఇండస్ట్రీ వారితో పాటు నెటిజన్లు కూడా బిత్తరబోయారంటే నమ్మండి.

ఇక వీడియోలో మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ జంట కోరింది. తాజాగా ‘‘ఒక పవిత్ర బంధం..రెండు మనసులు..మూడు ముళ్ళు..ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ పవిత్ర నరేష్’’ అంటూ ఓ వెడ్డింగ్ వీడియో షేర్ చేశారు నరేష్.. అది నిజం పెళ్లి కాదని.. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ సినిమా ప్రమోషన్స్‌లో పార్ట్ అని వార్తలు వస్తున్నాయి.. దాని గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటుండగానే.. హనీమూన్‌కి వెళ్లారు అనే హింట్ ఇచ్చేలా కొన్ని పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

ఆ పిక్స్, వీడియోస్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. కొత్త జంటలా ఇద్దరూ హానీమూన్ కోసం యూఏఈ వెళ్లినట్టున్నారు. అక్కడ పాపులర్ ప్లేసెస్ విజిట్ చేస్తూ.. పార్టీల్లో రచ్చ చేస్తూ హంగామా చేశారు.. ఇంకో హైలెట్ ఏంటంటే.. నరేష్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు.. మరి హనీమూన్‌కి ఎలా వెళ్తారు? అనే డౌట్ వస్తుంది.. కట్ చేస్తే కొద్ది రోజుల క్రితమే సీక్రెట్ ట్రిప్‌కి వెళ్లారని.. ఇప్పుడు కాస్త ఆలస్యంగా వెడ్డింగ్, హనీమూన్ వంటి విషయాలు రివీల్ చేస్తున్నారని అంటున్నారు. నరేష్ స్పందించే వరకు ఆ వ్యవహారం మీద పుట్టమీద పుట్టగొడుగుల్లా కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus