Naresh: మా ఎలక్షన్స్ వివాదంపై నరేష్ క్లారిటీ.. బాధ పడ్డానంటూ?

సీనియర్ నరేష్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో చిరంజీవికి వ్యతిరేకంగా సీనియర్ నరేష్ కొన్ని నిర్ణయాలు తీసుకోగా ఆ విషయాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎన్నికల వరకే అని తర్వాత రోజుల్లో కూడా చిరంజీవి గారితో కలిసి మాట్లాడానని నరేష్ అన్నారు. సాయితేజ్, నవీన్ మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందని ఆయన అన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మిస్ కమ్యూనికేషన్ వల్ల చిన్న గొడవ పెద్ద గొడవగా ప్రొజెక్ట్ అయిందని నరేష్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య కూడా అలాంటి గొడవలు జరుగుతుంటాయని ఆయన అన్నారు. చిన్నచిన్న గొడవలు జరిగిన తర్వాత కలిసిపోతుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో అలా జరగడం పట్ల నేను బాధ పడ్డానని నరేష్ తెలిపారు.

చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ ఎంత బాధ పడ్డారో తెలీదు కానీ వాళ్లను బాధ పెట్టినందుకు నేను చాలా బాధ పడ్డానని నరేష్ చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా మంచు విష్ణు చేసిన మంచి పనుల గురించి నరేష్ మాట్లాడుతూ ఏఐజీ ఆస్పత్రి నుంచి ఎన్నో మెడిసిన్స్, సౌకర్యాలను విష్ణు కల్పించారని సీనియర్ నరేష్ వెల్లడించారు. ఇండియాలోని చాలా పరిశ్రమలను మంచు విష్ణు ఒకే వేదికపైకి తెచ్చాడని ఆయన అన్నారు.

సీనియర్ నరేష్ (Naresh) వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ చేసిన రోల్స్ అన్నీ ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. రాబోయే రోజుల్లో సీనియర్ నరేష్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus