Naresh and Pavitra: పవిత్రతో కూడా నరేష్ విడిపోయాడా.. అసలు మేటర్ ఏంటి?

కొన్ని నెలల క్రితం సీనియర్ నటుడు నరేష్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి జరిగిన ప్రచారాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ ఓ టెంపుల్ లో కలిసి కనిపించడంతో అవి నిజమే అని అంతా నమ్మారు. నరేష్ కు ఆల్రెడీ మూడు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి అతనికి సెట్ కాదు అని భావించి పవిత్రతో అతను సహజీవనం కొనసాగిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

నరేష్ ఉంటున్న ఇంట్లోనే పవిత్ర ఉంటుంది. అదే ఇంట్లో సూపర్ స్టార్ కృష్ణగారు కూడా ఉంటున్నట్టు ఆమె ఓ కన్నడ మీడియా నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపెట్టింది. వీళ్ళిద్దరూ ఓ హోటల్ లో ఉండగా.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ జంట విడిపోయారు అనే వార్తలు ఊపందుకున్నాయి.

మరీ ముఖ్యంగా నరేష్ ప‌విత్ర‌ను దూరం పెడుతున్నాడని ఇన్సైడ్ టాక్. కొద్దిరోజులుగా నరేష్.. పవిత్రతో కలిసి బయట కనిపించడం లేదట. ఆయన సన్నిహితుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడట. అంతేకాదు ఈయన మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ కు దగ్గరయ్యాడట. అందువల్ల శాశ్వతంగా పవిత్ర వదిలించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. వీరి సహజీవనం విషయంలో ఇద్దరూ ఓపెన్ కాలేదు కాబట్టి..

ఒకవేళ ఇది నిజమైనా కూడా పవిత్ర.. నరేష్ ను నిలదీసే ఛాన్స్ అయితే లేదు. మరో విషయం ఏంటంటే వీరిద్దరూ కాంట్రాక్ట్ వల్ల కలిసున్నారు అనేది ఇన్సైడ్ టాక్. కోటి ఇన్నేళ్ల వరకు కలిసుంటే ఇన్ని కోట్లు చెల్లిస్తాను అని పవిత్ర- నరేష్ లు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందాన్ని పవిత్ర బ్రేక్ చేయకూడదు అనేది షరతు అని తెలుస్తుంది. ఏదేమైనా వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus