Naresh: ఆ వార్తల వల్ల ఇబ్బంది పడ్డాను… నరేష్ కామెంట్స్ వైరల్!

సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే ఈయన పవిత్ర లోకేష్ తో కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా థియేటర్లో విడుదలై పెద్దగా ఆదరణ పొందకపోయినా డిజిటల్ మీడియాలో మాత్రం మంచి ఆదరణ సంపాదించుకుంది.అయితే ఓటిటిలో ఈ సినిమా ప్రసారం కాకూడదంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టులో పిటిషన్ దాఖలు వేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బెంగుళూరు న్యాయస్థానం మెరిట్ లేని కారణంగా ఆమె పిటీషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ఈ సినిమాని నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చారు అనంతరం రమ్య రఘుపతి నరేష్ ఇంట్లోకి వెళ్లడానికి కూడా వీలు లేదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చారు. ఈ విధంగా బెంగళూరు కోర్టు తీర్పు ఇవ్వడంతో నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రమ్య రఘుపతి గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ..రమ్య రఘుపతికి చాలా అప్పులు ఉన్నాయి అప్పులు వసూలు చేసే వారు తరచు మా ఇంటికి రావడంతో మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇబ్బంది పడేవారని ఈయన తెలిపారు.అందువల్ల మేము కోర్టును ఆశ్రయించడంతో అనుమతి లేనిదే ఆమె నా ఇంట్లోకి రాకూడదని కోర్టు తీర్పునిచ్చిందని ఈయన తెలిపారు. ఇకపోతే ఆరు సంవత్సరాల నుంచి నేను రమ్య కలిసి కూడా ఉండడం లేదని ఇదే విషయాన్ని కోర్టు కూడా వెల్లడించిందని నరేష్ తెలిపారు.

బెంగళూరు కోర్టు ఇలా తీర్పు ఇవ్వడం తన విడాకులకు చాలా సులువైన మార్గం అవుతుందని ఈయన తెలిపారు ఇప్పటికే విడాకులకు సంబంధించి కూకట్పల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశామని తెలిపారు. ఇక తాను విడాకులకు అప్లై చేసినప్పటి నుంచి తనని ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయని ఈ వివాదాల కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు.

ఇక నేను పవిత్ర కలిసి ఉండటాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఉంటే తాను చాలా నరకం అనుభవించానని ఈ సందర్భంగా నరేష్ (Naresh) చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus