Yash: టాలెంటెడ్ డైరెక్టర్ తో ‘కేజీఎఫ్’ స్టార్..?

కొన్నేళ్లుగా ‘కేజీఎఫ్’ సినిమాలతో బిజీ అయిన యష్ ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. కానీ ఎలాంటి సినిమా చేయాలో తోచక ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన యష్ ఓ నిర్ణయం తీసుకున్నారని టాక్. నర్తన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట యష్. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఓ కొలిక్కి రావడానికి సమయం పెట్టింది.

పలు వెర్షన్స్ మీద వర్క్ చేసి ఫైనల్ గా ఒక వెర్షన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని సమాచారం. కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేశారు నర్తన్. 2017లో శివరాజ్ కుమార్, శ్రీమురళి కాంబినేషన్ లో ‘మఫ్టీ’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా అక్కడ పెద్ద హిట్టు.. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. తమిళంలో శింబు-గౌతమ్ కార్తీక్ హీరోలుగా ‘పత్తు తల’ టైటిల్ తో షూటింగ్ మొదలుపెట్టారు నర్తన్.

కానీ ఏవో కారణాల వలన సినిమాను ఆపేశారు, మళ్లీ కొనసాగిస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. నర్తన్ కు ప్రశాంత్ నీల్ దగ్గర పని చేసిన అనుభవం ఉంది. కన్నడ దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తోన్న యష్.. ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ రేంజ్ పెరిగిపోయింది. ఇకపై ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ దేశవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. అందుకే స్క్రిప్ట్ ల విషయంలో యష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుకే తొందరపడకుండా కథలను ఎన్నుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం హోంబలే ఫిలిమ్స్, దిల్ రాజుతో కలిసి యష్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నర్తన్ సినిమాను వీరే ప్రొడ్యూస్ చేస్తారో లేక కొత్తవాళ్లు ఎవరైనా టేకప్ చేస్తారో చూడాలి!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus