గతకొద్ది కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్ ఈసారి ‘నరుడా డోనరుడా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ చిత్రానికి రీమేక్ ఇది. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట సంయుక్తంగా నిర్మించారు. సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇందులో సుమంత్ వీర్యం డోనర్ పాత్రలో కనిపించాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ డోనరుడు ప్రేక్షకులను మెప్పించాడో లేదో చూద్దామా!
కథ : ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, ఎలాంటి పని పాట లేకుండా సరదాగా గడిపే కుర్రాడు విక్రమ్(సుమంత్). ఇక పిల్లలు పుట్టకుండా బాధపడేవారికి వైద్యం చేసే డాక్టర్ ఆంజనేయులు(తనికెళ్ళభరణి). సరైన స్పెర్మ్ లభించక పేషంట్స్ నుంచి ఇబ్బందులు పడుతూ సరైన స్పెర్మ్ డోనర్ కోసం ఎదురుచూస్తుంటాడు. అనుకోకుండా ఆంజనేయులుకు విక్రమ్ దొరుకుతాడు. విక్రమ్ ను ఎలాగోలా ఒప్పించి అతడిని రెగ్యులర్ స్పెర్మ్ డోనర్ గా సెట్ చేస్తాడు. ఇదిలా జరుగుతున్న సమయంలో ఆశిమా రాయ్(పల్లవి సుభాష్)తో ప్రేమలో పడతాడు విక్రమ్. అయితే విక్రమ్ జీవితంలోకి ఎంట్రీ అయిన తర్వాత స్పెర్మ్ డోనర్ గా పనిచేయడం మానేయాలని నిర్ణయించుకుంటాడు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్ జీవితంలోకి ఆశిమా ఎలాంటి మార్పులు తెచ్చింది? విక్రమ్ స్పెర్మ్ డోనర్ గా కంటిన్యూ అయ్యాడా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : సుమంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. తనదైన యాక్టింగ్, కామెడి టైమింగ్ తో మెప్పించాడు. ముఖ్యంగా స్పర్మ్ డొనేట్ సమయంలో సుమంత్ చేసిన యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ బాగా పండించాడు. ఇక తనికెళ్ళభరణి తన పాత్రలో అదరగొట్టేసాడు. ఆ పాత్రకు ఆయన తప్ప ఇంకెవరూ సరిపోరు అనిపించే విధంగా చేసారు. ఇక హీరోయిన్ పల్లవి సుభాష్ లుక్స్, గ్లామర్ పరంగా బాగుంది. సుమంత్-పల్లవిల జోడి బాగుంది. సుమంత్ తల్లిగా శ్రీలక్ష్మి, అసిస్టెంట్ గా సుమన్ శెట్టిలు పర్వాలేదనిపించారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు.
‘నరుడా డోనరుడా’ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్, ఎంటర్ టైన్మెంట్ తో సరదా సరదాగా సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో కూడిన కామెడి, లవ్ అంశాలు బాగున్నాయి. సినిమాలో ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా తీసారు. అయితే సినిమాలో చాలా మంది కొత్తవాళ్ళు కావడం వల్ల అక్కడక్కడ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవలేకపోతుంటారు. మొత్తానికి సినిమా పరవలేదనిపించింది.
సాంకేతికవర్గం పనితీరు : శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగున్నాయి. సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక షానియాల్ డియో అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక మల్లిక్ రామ్ ‘విక్కీ డోనర్’ కథను తెలుగు నేటివిటికి మార్చడంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. కొన్ని కొన్ని చోట్ల తన స్క్రీన్ ప్లేతో మెప్పించిన… చాలా చోట్ల అంతగా ఆకట్టుకోలేదు. నటీనటుల నుంచి సరైన నటనను రాబట్టుకోలేకపోయాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.
విశ్లేషణ : ‘నరుడా డోనరుడా’ వంటి బోల్డ్ సినిమాల హవా ఈ మధ్య చాలా ఎక్కువయ్యింది. ‘వీర్యదానం’ అనేది పెద్ద బూతు అని కాకుండా, ఒక సామాజిక అంశంగా తీసుకొని ఈ సినిమా చూస్తే… ఇందులో మంచి మెసేజ్ కూడా వుంది. యూత్ మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.
రేటింగ్ : 2.75/5