Naseeruddin Shah: భారతీయ సినిమాలపై ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల గ్రాస్ కలెక్షన్లు 1500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉన్నాయి. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. పురుషుల ఆత్మన్యూనతా భావం ఎక్కువ కావడం వల్ల ఈ మధ్య కాలంలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని ఆయన కామెంట్లు చేశారు.

అమెరికాలోని మార్వెల్ యూనివర్స్ సినిమాలు సైతం ఇదే తరహాలో ఇది తరహాలోనివని నసీరుద్దీన్ షా వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోందని నసీరుద్దీన్ షా కామెంట్లు చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ సినిమాలను ఇప్పటివరకు నేను చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాలు చూసి థ్రిల్ కాకుండా ప్రేక్షకులు ఏం పొందుతారో నాకు తెలియదని ఆయన అన్నారు.

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ చూశానని నసీరుద్దీన్ షా తెలిపారు. ఎలాంటి అజెండాలు లేకుండా మణిరత్నం సినిమాలు చేస్తారని నసీరుద్దీన్ షా వెల్లడించారు. నిషాంత్ అనే సినిమాతో నసీరుద్దీన్ షా కెరీర్ మొదలైంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించి మెప్పించారు. హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం నసీరుద్దీన్ షా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు.

నసీరుద్దీన్ షా  (Naseeruddin Shah) రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. నసీరుద్దీన్ షా కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నసీరుద్దీన్ షా చేసిన కామెంట్లపై టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. సినిమాలను చూడకుండా జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus