Bigg Boss 5 Telugu: నటరాజ్ మాస్టర్ ఆవిషయంలో మిస్టేక్ చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ అందరూ టాస్క్ వస్తే రెచ్చిపోతారు. మా టీమ్ గెలవాలంటే మా టీమ్ గెలవాలని చూస్తారు. అలాగే కెప్టెన్సీ టాస్క్ అయితే మాత్రం ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్లకి ఉంటుంది. 4వ వారం బిగ్ బాస్ గెలవాలంటే తగ్గాల్సిందే అనే టాస్క్ ఇచ్చాడు. ఇక్కడే ఫస్ట్ పవర్ రూమ్ యాక్సెస్ ని దక్కించుకున్నారు నటరాజ్ మాస్టర్. జంటగా ఆడాల్సిన ఈ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ లోబోని సెలక్ట్ చేస్కున్నారు. వీరిద్దరూ పవర్ రూమ్ కి వెళ్లి ఛాలెంజ్ ని ఎదుర్కున్నారు. ఇందులో భాగంగా హమీదా ఇంకా శ్రీరామ్ జంటని నటరాజ్ మాస్టర్ సెలక్ట్ చేస్కున్నారు.

ఛాలెంజ్ ఏంటి అనేది చాలా క్లియర్ గా మాస్టర్ కి తెలుసు. అంతేకాదు, అక్కడున్న హౌస్ మేట్స్ అందరికీ కూడా బాగా తెలుసు. ఇక్కడే మాస్టర్ పప్పులో కాలేశారా అనిపించింది. శ్రీరామ్ చంద్ర అంతకుముందు టాస్క్ లు ఎలా పెర్ఫామ్ చేశాడో మాస్టర్ కళ్లారా చూశారు. ఈగల్స్ టీమ్ లో ఉన్నప్పుడు కెప్టెన్ గా దూసుకుపోయి మరీ గేమ్ ఆడాడు. అలాగే కెప్టెన్సీ టాస్క్ లో స్విమ్మింగ్ పూల్ లో దూకి ఆల్ మోస్ట్ టాస్క్ ని ఫినిష్ చేశాడు. అయితే, నటరాజ్ మాస్టర్ ఇవేమీ ఆలోచించకుండా హమీదా ఇంకా శ్రీరామ్ పెయిర్ ని సెలక్ట్ చేస్కున్నాడు.

నాలుగు భాగాలుగా వచ్చిన బక్కెట్ ని ఇద్దరు హోల్డ్ చేస్తూ ఆ బక్కెట్ సహాయంతో బిగ్ బాస్ డిస్ ప్లే లో చెప్పిన వస్తువులని తీసుకుని వచ్చి బాస్కెట్ లో వేయాలి. ఇక్కడే చాలా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడాయి రెండు జంటలు. ముందునుంచీ శ్రీరామ్ చంద్ర చాలా ఫాస్ట్ గా గేమ్ ఆడాడు. దీంతో మాస్టర్ జంట కంటే ముందే స్పూన్స్ ని వేసి టాస్క్ ని ఫినిష్ చేశాడు. అంతకు ముందు కూడా సన్నీ టీషర్ట్ ని ముందుగానే వేశాడు. దీంతో మాస్టర్ – లోబో జంట ఓడిపోయింది. ఆ తర్వాత నాకు వెలిగింది.. చెప్తా.. చెప్తా అంటూ మాస్టర్ మరో స్కెచ్ గీశారు. ఇప్పటికే బరువులో అర్ధకేజీ పెరిగిన మాస్టర్ జంట తర్వాత గేమ్ లో ఎలా ముందుకు వెళ్తుందనేది చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus