బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్. దీనికోసమే ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, గేమ్ ఆడేందుకు హౌస్ లోకి వెళ్తుంటారు. వారికి నచ్చినట్లుగా బిహేవ్ చేస్తూనే తోటి హౌస్ మేట్స్ తో బాండింగ్ ఏర్పరచుకుంటారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడు ఎమోషనల్ కూడా అయిపోతుంటారు. దీనికి తగ్గట్లుగానే బిగ్ బాస్ టాస్క్ లని, గేమ్ లని డిజైన్ చేస్తూ , హౌస్ మేట్స్ ని ఎమోషనల్ గా బరెస్ట్ చేస్తుంటాడు. చూసే వాళ్లకి మంచి ఎంటర్ టైన్మంట్ కలిగించే విధంగా ఈ షోని డిజైన్ చేశారు.
అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ అనేది ఇప్పుడు మరో లెవల్లో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత మంచి షోని టెలివిజన్ లో టెలికాస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారని వాపోతున్నారు. ఇక ఈవారం కిల్లర్ టాస్క్ అయితే నటరాజ్ మాస్టర్ సూపర్ గా ఆడారని, ఆయనకి మరో రెండు మూడు వారాలు హౌస్ లో తిరుగులేదని, టాప్ 5లోకి ఖచ్చితంగా వెళ్లిపోతారని కామెంట్స్ చేస్తున్నారు. కిల్లర్ టాస్క్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ ని కిల్లర్ గా ప్రకటించిన బిగ్ బాస్ ఒక సీక్రెట్ ఫోన్ ఇచ్చాడు.
ఇందులో బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొన్ని ఛాలెంజస్ ని నటరాజ్ మాస్టర్ కి ఇస్తూ వాళ్లని మర్డర్ చేయాలని చెప్పాడు. ఆరు మర్డర్స్ లో ఐదు మర్డర్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసిన నటరాజ్ మాస్టర్, హౌస్ మేట్స్ కి అస్సలు ఎక్కడా దొరకలేదు. కనీసం అనుమానం కూడా రాకుండా మేనేజ్ చేశారు. నిజానికి మిగతా హౌస్ మేట్స్ గేమ్ ని డైవర్ట్ చేయడం వల్ల నటరాజ్ మాస్టర్ పై అస్సలు ఎవరికీ అనుమానం రాలేదు. అందుకే గెస్ చేయలేకపోయారు. నటరాజ్ మాస్టర్ గేమ్ ని అద్భుతంగా ముందుకు తీస్కుని వెళ్లారు.
బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజస్ అన్నీ కూడా ఫటా ఫట్ చేసి టాస్క్ లో టాప్ అయ్యారు. తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ ఓడిపోయారు. దీంతో చాలాసేపు ఎమోషనల్ అయిపోయారు. కూతురు కోసం ఆడుతున్నాను అని, కెప్టెన్ అవ్వలేకపోయానని చాలాసేపు ఏడ్చారు. నిజానికి టాస్క్ ఓడిపోగానే ఏడుస్తున్న నటరాజ్ మాస్టర్ ని హౌస్ మేట్స్ అందరూ ఓదార్చారు. కష్టపడి ఇంత గేమ్ ఆడిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఓడిపోయాను అని చాలాసేపు బాధపడ్డారు నటరాజ్ మాస్టర్.
ఇప్పుడు ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే, టాస్క్ లో 100శాతం పెర్ఫామన్స్ ఇచ్చినందుకు నటరాజ్ మాస్టర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్. ఈ వీడియోలని తీసి షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నటరాజ్ మాస్టర్ కి అన్ అఫీషియల్ సైట్స్ లో ఓటింగ్ కూడా హ్యూజ్ గా వస్తుండటం విశేషం. అదీ మేటర్.