బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఎలిమినేషన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచీ బయటకి వచ్చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి ఈసారి నాలుగోవారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురుని శనివారం రోజునే సేఫ్ చేశారు హోస్ట్ నాగార్జున. రవి, సన్నీ, ప్రియ, సిరిలని సేఫ్ చేశారు. మిగిలిన నలుగురుని నామినేషన్స్ లో అలాగే ఉంచారు. ఇందులో నుంచీ ఈసారి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
నిజానికి అన్ అఫీషియల్ సైట్స్ చూస్తే నటరాజ్ మాస్టర్ ఇంకా అనీమాస్టర్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీరిద్దరితో పాటుగా లోబో కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. కానీ, లోబో హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి లోబోని మరికొన్ని వారాలు ఉంచితే బాగుంటుందని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక వరుసగా హౌస్ లో నుంచీ ఫిమేల్ కంటెస్టెంట్స్ బయటకి రావడం కూడా ఆటతీరుని ప్రశ్నించేలాగానే ఉంది. అందుకే, అనీమాస్టర్ ని కూడా సేఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నటరాజ్ మాస్టర్ ని ఎలిమినేట్ చేయాల్సివచ్చింది.
అన్ అఫీషియల్ సైట్స్ లో జరిగిన పబ్లిక్ ఓటింగ్ ప్రకారం చూస్తే నటరాజ్ మాస్టర్ అనీమాస్టర్ కంటే కూడా టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. కానీ, నటరాజ్ మాస్టర్ పెర్ఫామన్స్ నాలుగువారాలు గేమ్ ఆడిన పద్దతిని బట్టీ చూస్తే మాస్టర్ ని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.