Nataraj Master Remuneration: ‘బిగ్ బాస్5’ కి నటరాజ్ మాస్టర్ పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

‘బిగ్ బాస్5′ కి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్.’ఆట’ ద్వారా పాపులర్ అయిన ఇతను టాలీవుడ్లో ఉన్న చాలా మంది స్టార్ కొరియోగ్రాఫర్స్ కి గురువు అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.ఒకప్పుడు జెమినీలో ప్రసారమయ్యే ‘డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌’ కు దర్శకుడు, కాన్సెప్ట్ క్రియేటర్ నటరాజ్ మాస్టరే.టాలీవుడ్లో 20 ఏళ్ళకి పైగా కొనసాగిన నటరాజ్ మాస్టర్ పెద్ద హీరోలందరితో అలాగే స్టార్ డైరెక్టర్స్ వర్క్ చేశారు.

ఇక హౌస్ లోకి వెళ్ళినప్పటి నుండీ నటరాజ్ పై జనాల్లో సింపతీ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఆమె భార్య ఇప్పుడు గర్భవతి కాబట్టి.అయితే నాలుగు వారాల్లోనే అతను బయటకి వచ్చేసాడు. ‘ ‘బిగ్ బాస్’ కు ఏదో సాధించాలని వెళ్ళాను కానీ ఏమి సాధించకుండానే వచ్చేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు నటరాజ్. దానికి నాగార్జున ‘నీ భార్యకి నీ అవసరం ఉంది కాబట్టే.. దేవుడు నిన్ను త్వరగా బయటకి రప్పించి ఉండొచ్చు’ అంటూ ధైర్యం చెప్పారు.

ఇక నాలుగు వారాలు బిగ్ బాస్ లో ఉన్నందుకు గాను.. నటరాజ్ మాస్టర్ కు మంచి పారితోషికమే అందిందంట. రోజుకి రూ.15వేలు చొప్పున నాలుగు వారాలకి రూ.4 లక్షల వరకు ఈయన పారితోషికం అందుకున్నారట. దీంతో పాటు నటరాజ్ మాస్టర్ కు హోస్ట్ నాగార్జున అలాగే నిర్వాహకులు మరింత చెల్లించినట్టు భోగట్టా. అలా చూసుకుంటే నటరాజ్ మాస్టర్ కు ఈ షో వల్ల మంచే జరిగిందని చెప్పాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus