బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ టాస్క్ ఇరగదీసి మరీ ఆడారు. లాస్ట్ సీజన్ లో టాప్ – 5 కంటెస్టెంట్స్ లో ఒకరైన మానస్ హౌస్ లోకి రాగానే హౌస్ మేట్స్ ని పలకరించాడు. అంతేకాదు, తనకి ఎంతో ఫేవరెట్ అయిన టాస్క్ ని ఆడించాడు. ఈ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ క్లీన్ స్వీప్ చేసి , మానస్ కి ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. రింగ్ లో నుంచీ కర్చీఫ్ కోసం దూకుతూ రెచ్చిపోయి మరీ ఆడారు. దీంతో అన్నిసార్లు నటరాజ్ మాస్టర్ గెలిచి మిస్టరీ బాక్స్ ని చేజిక్కించుకున్నాడు. అయితే, ఇక్కడితే గేమ్ అయిపోయిందనే అనుకున్నారు అందరూ. కానీ, అసలు టాస్క్ అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది. బ్యాలన్సింగ్ చేసేటపుడు లాస్ట్ వరకూ పోరాడిన నటరాజ్ మాస్టర్ కేవలం తన కాలి నొప్పి వల్ల మాత్రమే ఓడిపోయారు. హౌస్ మేట్స్ బ్యాలన్సింగ్ లో అత్యద్భుతంగా పార్టిసిపేట్ చేస్తుంటే, బిగ్ బాస్ లెవల్స్ పెంచుకుంటూ వెళ్లాడు. లాస్ట్ లెవల్ లో ఒంటి కాలిపైన నుంచోమని చెప్పాడు. దీంతో నటరాజ్ మాస్టర్ కి కష్టమైపోయింది. బరిలో అరియానా , ఇంకా అనిల్ ఇద్దరూ ఉన్నారు. ఫస్ట్ అరియానా అవుట్ అవ్వగానే మాస్టర్ ఉండలేకపోయారు. తర్వాత కాలు కింద పెట్టేశారు. దీంతో నటరాజ్ మాస్టర్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఈ టాస్క్ మాస్టర్ గెలిచినా కూడా వేస్ట్ అయ్యేదే. ఎందుకంటే..,
నటరాజ్ మాస్టర్ కి వచ్చిన మిస్టరీ బాక్స్ లో వన్ ర్యాంక్ డౌన్ అని రాసి ఉంది. అంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటే ఒక ర్యాంక్ తక్కువ అయిపోయేవారు. టాస్క్ కష్టపడి ఆడి గెలిచినా కూడా వేస్ట్ అయ్యేదే. రెండో ర్యాంక్ లో నిలిచేవారు. పోటీదారులు అయ్యేవాడు కాదు. ఇక టాస్క్ లో చివరి వరకూ పట్టుదలతో ఉన్న అనిల్ ఎవిక్షన్ పాస్ కోసం పోటీ పడే రెండో పోటీదారుడు అయ్యాడు.
టాస్క్ లో తనదైన స్టైల్లో ఇరగదీసి ఆడిన మాస్టర్ ఆ తర్వాత తన పాప ఫోటో దగ్గరకి వెళ్లి చాలాసేపు బాధపడ్డాడు. కష్టపడి గేమ్ ఆఢాను అని అయినా కూడా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఇది మాస్టర్ కి రెండోసారి లక్ కలిసిరాలేదు. అంతకుముందు కిల్లర్ టాస్క్ లో కూడా ఇదే జరిగింది. ఆ వారం మాస్టర్ అద్దిరిపోయే గేమ్ ఆడినా కూడా కెప్టెన్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మిస్టరీ బాక్స్ చేజిక్కుంచుకున్నా కూడా అది తనకోసమే వాడటం వల్ల మాస్టర్ కి కలిసిరాలేదు. ఇక్కడే మాస్టర్ లో నిజాయితీ కనిపించింది. వేరేవాళ్లకి అది యూజ్ చేయను అని, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేనే భరిస్తా అని చెప్పడం వల్లే మాస్టర్ గేమ్ లో ఓడిపోయారు. మొత్తానికి ఈ సీజన్ లో మాస్టర్ స్టైల్ డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి. అదీ మేటర్.