Natraj Master: వైభవంగా నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం వేడుక

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ 12వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఆట షో నుంచి గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయనకు సరైన బ్రేక్ అయితే రావడం లేదు. ఎక్కువగా స్టేట్ షోలతో సినిమా కొరియోగ్రఫీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే సినిమాలో కూడా కొరియోగ్రఫీ చేయాలని ఆయన బాగానే కష్టపడ్డారు.ఇప్పుడు ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని,

బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే బయటకు వెళ్లాలని కసిగా నిలబడుతున్నారు. తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టిన నటరాజ్ హౌస్ లోకి వచ్చేటప్పుడు కాస్త ఎమోషనల్ అవుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన సతీమణి నీతూ ఏడు నెలల గర్భవతి కావడంతో అప్పుడే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే ఆఫర్ వచ్చినప్పటికీ కూడా వెళ్ళకూడదు అని అనుకున్నాడు. కానీ భార్య మద్దతు వల్లే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాల్సి వచ్చింది.

ఇక రీసెంట్ గా కొంతమంది బుల్లితెర నటీనటులు సందడితో నీతూ సీమంతం వైభవంగా జరిగింది. బుల్లితెర తారలు నవీన, శ్రీవాణి,అంజలి పవన్‌, జ్యోతి రెడ్డి తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం సీమంతంకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌అవుతున్నాయి. ఆ ఫోటోలో నటరాజ్ సతీమణి నీతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మరో వైపు నటరాజ్ మాస్టర్ మొదటి రెండు వారాల్లో కూడా నామినేషన్స్ లో పోరాడుతూ వచ్చారు.

1

2

3

4

5

6

7

8

9

10

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus