అఖిల్‌ కెరీర్‌పై నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌… కుట్రలున్నాయంటూ…

  • May 1, 2023 / 11:14 PM IST

కుర్ర హీరోలు అంతా ప్రేమకథలు చేస్తూ.. మధ్య మధ్యలో మాస్‌ కథల ప్రయోగాలు చేస్తుండగా.. అఖిల్‌ మాత్రం కొడితే మాస్‌ హిట్‌ కొట్టాల్సిందే అని తొలి సినిమా నుండే పోరాడుతున్నాడు. అయితే ప్రేమ కథలు చేస్తున్నా.. అదిరిపోయే నాటు సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో వరుస ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఈ క్రమంలో ఇటీవల ‘ఏజెంట్‌’ సినిమా వచ్చింది. ఈ క్రమంలో ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అఖిల్‌ను తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది అనేది ఆయన మాటల సారాంశం.

టాలీవుడ్ నిర్మాతల్లో కాస్త కాంట్రవర్శీ అంటే వినిపించే నిర్మాతల్లో పేర్లలో నట్టి కుమార్ ఒకటి. ఆయనే అఖిల్‌ విషయంలో ఈ కామెంట్స్‌ చేశారు. అఖిల్‌ను తొక్కేసేందుకు పద్ధతి ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమను ఒక్కరే తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. అఖిల్ సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా చేస్తున్నారన్నారు. అంతేకాదు కుట్రలో భాగంగానే తమిళ సినిమాకు థియేటర్లు ఇచ్చారని తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ మేరకు సంచలన ఆరోపణలు చేశారు. చిత్ర పరిశ్రమలో రాజకీయాలు, కుట్రలు, ఎత్తుగడలు చాలా ఉన్నాయి. వాటిని తట్టుకుని ముందుకెళ్లడం అఖిల్ వల్ల అవుతుందా? అక్కినేని ఫ్యామిలీ వల్ల అవుతుందా? అని అనిపిస్తోంది అన్నారు నట్లి కుమార్‌. అక్కినేని ఫ్యామిలీ చాలా సైలెంట్‌గా ఉంటుంది. ఆ ఫ్యామిలీకి చెందిన ఓ హీరోను తొక్కేయడానికి ఓ అగ్ర నిర్మాత థియేటర్లను బ్లాక్ చేశారు అని విమర్శించారు.

‘ఏజెంట్’ సినిమాకు రిలీజ్‌కి ముందు వరకు డిస్ట్రిబ్యూటర్లకు దొరకలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ప్రశ్నలు రేకెత్తించారు నట్టి కుమార్‌. అయితే నట్టి కుమార్‌ ఇలా కొంతమందిని కేంద్రంగా చేసుకుని విమర్శలు చేయడం కొత్తేం కాదు. ఆయన సినిమాకు థియేటర్లు దొరకని సందర్భంలో ఇలా మాట్లాడుతుంటారు. అయితే ఈసారి అఖిల్ సినిమాను పట్టుకుని మాట్లాడుతున్నారు. అయితే దీనిపై ఎవరైనా స్పందిస్తే ఇంకాస్త క్లారిటీ రావొచ్చు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus