గత సంవత్సరం ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ వంటి పరాజయాలను చవి చూసాడు నాని. ఇందులో ‘దేవదాస్’ చిత్రానికి మంచి రివ్యూలు,మౌత్ టాక్ వచ్చినప్పటికీ.. హై కాస్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడంతో ప్లాప్ గా మిగిలింది. అయితే ఈ రెండు చిత్రాల ఎఫెక్ట్ నాని మార్కెట్ పై పడుతుందని అనుకున్నారంతా..! అయితే ఈ ప్లాపులు నాని మార్కెట్ పై ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ప్రస్తుతం నాని.. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ నేపథ్యంలో సాగే కధాంశంతో ఈ చిత్రం తెరెకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన రావడంతో… ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిసినెస్ విషయానికివస్తే మొత్తం 52 కోట్లకు ఈ చిత్రం హక్కులు అమ్ముడైయ్యాయని తెలుస్తుంది. ఇందులో శాటిలైట్ రైట్స్ 12కోట్ల కాగా హిందీ డబ్బింగ్ రైట్స్ 6కోట్లు , ఓవర్సీస్ రైట్స్ 4కోట్లు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 30కోట్ల వరకూ అమ్ముడైయ్యాయని సమాచారం. ఇక నాని కి ఓవర్సీస్ లో ఎలాగూ మంచి మార్కెట్ వుంది. ఇక ఈ చిత్రం నాని కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా నిలిచింది. మరి నాని ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్నందుకుంటాడో చూడాలి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 19 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.