మణిరత్నం లాంటి లెజండరీ సింగర్ ఫిల్మ్ మేకర్ ‘నవరస’ అనే ఆంథాలజీ ఫిల్మ్ ను నిర్మించారు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా నిర్మించిన ఈ సిరీస్ కు ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్ లాంటి వారు దర్శకులుగా వ్యవహరించారు. కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్, పార్వతి, రేవతి లాంటి ఆర్టిస్ట్ లు ఇందులో నటించారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అంటే ఇక ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే.
కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆంథాలజీ ఫిల్మ్ ను రూపొందించారు. ట్రైలర్, టీజర్స్ అంచనాలను మరింత పెంచేశాయి. కానీ ఈ సిరీస్ చూసిన వాళ్లు చాలా వరకు నిరుత్సాహానికి గురవుతున్నారు. నవరసాల్లో ఒక్కో రసాన్ని ప్రతిబింబించేలా తొమ్మిది ఎపిసోడ్లు రూపొందగా.. ఇందులో రెండు, మూడు మినహా అంత ఎఫెక్టివ్ గా లేవు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అందులో అరవింద్ స్వామి డైరెక్ట్ చేసిన ‘రౌద్రం’ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అలానే కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిసోడ్ ‘ప్రాజెక్ట్ అగ్ని’ కూడా బాగుందని అంటున్నారు. యోగిబాబు ప్రధాన పాత్రలో హాస్య ప్రధానంగా సాగే ‘సమ్మర్ ఆఫ్ 1992’ కూడా బాగుందట. మిగిలిన ఎపిసోడ్లకు మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ సూర్య చేసిన ఎపిసోడ్, విజయ్ సేతుపతి-ప్రకాష్ రాజ్ నటించిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. మిగిలిన ఎపిసోడ్స్ కి కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!