Swathi: తిని పెళ్లి చేసుకున్నావా అంటూ నన్నే ప్రశ్నించారు!

అందాల రాక్షసి సినిమా ద్వారా నటుడుగా పరిచయమయ్యారు నటుడు నవీన్ చంద్ర. ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో హీరోగాను అలాగే, సపోర్టింగ్ పాత్రలలోను అలాగే విలన్ పాత్రలలో కూడా నటిస్తున్న మెప్పిస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన మంత్ ఆఫ్ మధు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర కలర్స్ స్వాతి జంటగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి నవీన్ చంద్రకు ఒక ప్రశ్న ఎదురయింది. ఈ సినిమాలో నవీన్ చంద్రకు జోడిగా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఇదివరకు త్రిపుర సినిమాలో కూడా జంటగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా సమయంలో వీరిద్దరూ పెళ్లి దుస్తులలో పెళ్లి మండపంలో వధూవరులుగా కూర్చుని ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పట్లో ఇది కాస్త వైరల్ గా మారింది.

నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేశారు. ఇలా అప్పట్లో వీరిద్దరి పెళ్లి గురించి వచ్చినటువంటి ఈ వార్తలపై తాజాగా నవీన్ చంద్ర స్పందించారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో మా ఇద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మేము నిజంగానే పెళ్లి చేసుకుంటున్నామని చాలా మంది భావించారు. ఇక కొందరైతే నేరుగా కలర్స్ స్వాతిని (Swathi) పెళ్లి చేసుకున్నావా అంటూ న్ననే ప్రశ్నించారని ఈయన తెలియజేశారు.

అయితే కొద్ది రోజులకు సినిమా నుంచి అదే ఫోటో పోస్టర్ గా రావడంతో చాలామందికి ఇదొక సినిమా అని అర్థం అయింది అంటూ నవీన్ చంద్ర గతంలో వీరు పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక కలర్స్ స్వాతితో తమకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్ ఉందని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus