‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు సంబంధించిన వారు ఎవరైనా మీడియా ముందుకు వస్తే.. మీడియా వాళ్ళు ఆ సినిమా గురించి ఏదో ఒక టాపిక్ తెచ్చి… వాళ్ళని ఇబ్బంది పెడుతుండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) ఈవెంట్లో దిల్ రాజుని (Dil Raju) ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రశ్నించారు. అప్పుడు దిల్ రాజు ఓపెన్ గానే తన అసహనాన్ని బయటపెట్టారు. అంతకు ముందు ‘కోర్ట్’ (Court) ప్రమోషన్స్ లో ప్రియదర్శిని (Priyadarshi) కూడా ఒక రిపోర్టర్ ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రశ్నించాడు.
ఆ తర్వాత నవీన్ చంద్రని (Naveen Chandra) కూడా అలాగే ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రశ్నించి ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూల్ గా సమాధానం ఇచ్చిన నవీన్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘అది సరైన పద్ధతి కాదు’ అన్నట్టు సమాధానం ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్… “ఇటీవల ఓ రిపోర్టర్ మిమ్మల్ని ‘గేమ్ ఛేంజర్’ గురించి అడిగారు. మీరు చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు. ‘బళ్లారిలో శంకర్ గారి సినిమాలు చూస్తూ వచ్చిన నేను, ఇప్పుడు శంకర్ (Shankar) గారి సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్.
సో నేను ఆయన సినిమాలో వర్క్ చేసిన విధానాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ కంటే నాకు అది ఎక్కువ ఆనందాన్ని, మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని చాలా బాగా చెప్పారు. మీ సింప్లిసిటీ అందరూ చాలా బాగా అభినందించారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ గురించి ఈ మధ్య ఎగతాళిగా మాట్లాడటం అనేది కూడా కామన్ అయిపోయింది కదా?” అంటూ యాంకర్ నవీన్ చంద్రని ప్రశ్నించాడు.
అందుకు నవీన్ చంద్ర.. ” ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించి ఈ మధ్య చాలా మంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సినిమా ఫలితాలు ఎవరి చేతిల్లోనూ ఉండవు. ప్రపంచంలో ఏదేదో జరుగుతుంటే.. అంతా ఇంకొకరి గురించి ఎగతాళిగా మాట్లాడటమే పనిగా పెట్టుకుంటున్నారు.మనం కూడా మూవ్ అవ్వాలి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.