టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నవ్యస్వామి. ఆమెకి సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘ఆమె కథ’ సీరియల్ నవ్యకు మరింత పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సీరియల్ లో ఆమె రవికృష్ణ సరసన నటిస్తోంది. అయితే రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నారు. టీవీ షోల్లో, ఈవెంట్లలో ఈ జంట కలిసి కనిపించడంతో వీరి లవ్ ట్రాక్ పై గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
రీసెంట్ గా అలీ నిర్వహిస్తోన్న ఓ షోకి గెస్ట్ గా హాజరైంది నవ్య. ఈ క్రమంలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. ఓ పార్టీలో మేనేజర్ ని చితక్కొట్టేశానని.. ఆ కొట్టుడికి అతడు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదంటూ స్టోరీ చెప్పుకొచ్చింది. తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు.. అందరూ డాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని.. అదే సమయంలో ఈవెంట్ మేనేజర్ తనను తప్పుగా తాకాదని చెప్పింది. దీంతో వెంటనే అతడికి పట్టుకొని ఇష్టమొచ్చినట్లు కొట్టేశానని.. కాళ్లతో తన్నుతూ.. చేతులతో బాగా కొట్టానని చెప్పింది.
తను కొట్టిన కొట్టుడుకి చేతివేళ్లు వాచిపోయాయని.. ఆ ఘటనతో చాలా భయపడినట్లు చెప్పింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశానని.. తెలియని వారు మనల్ని తాకితే ఎలా ఉంటుందని తను ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ విషయానికొస్తే.. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని కానీ ప్రస్తుతం సీరియల్స్ లోనే నటించాలనుకునట్లు చెప్పింది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!