ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఓటీటీల్లో కూడా తన హవా కొనసాగించాడు. అయితే ఇప్పుడొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయనని తెగేసి చెప్పేశాడు. ఓటీటీ కంటెంట్‌లో వచ్చిన మార్పు తనని చాలా డిస్టర్బ్ చేసిందని, అందుకే ఇక డిజిటల్ ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నానని ప్రకటించాడు ఈ స్టార్. ఈయన నటించిన ‘సేక్రేడ్ గేమ్స్’ సిరీస్ మంచి సక్సెస్ అయింది.
ఆ సిరీస్ లో నటిస్తున్నప్పుడు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించిందని.. మంచి కంటెంట్‌కి ఓటీటీలు స్థానం కల్పిస్తున్నాయని, కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నాయని ఆనందంగా ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడొస్తున్న కంటెంట్ చూస్తుంటే చాలా చిరాకుగా ఉంటుందని.. చెత్త కంటెంట్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని నింపేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఇలాంటి వాటిలో నటించి కొందరు స్టార్స్ అయిపోతున్నారని.. ఇక ఇక్కడ నాలాంటి వాడికి పనేముందని ప్రశ్నించారు. దీనికి తోడు ఇదో దందాలా తయారైందని..
పెద్ద పెద్ద నిర్మాతలు ఓటీటీ బిజినెస్ లోకి వచ్చి వరుస ప్రాజెక్టులు చేస్తామంటూ భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని.. దాంతో క్వాంటిటీ క్వాలిటీని చంపేస్తోందని చెప్పుకొచ్చారు. అందుకే ఇకపై ఓటీటీల కోసం పని చేయకూడదని డిసైడ్ చేసుకున్నానని తెలిపారు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!