తమిళంలో ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్… ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో వడివేలు, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్ ని తీసుకుని సన్నివేశాలు రాసుకుని కథనాన్ని నడిపిస్తూ ఉంటారు. అక్కడ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
వీక్ డేస్ లో కూడా పాజిటివ్ టాక్ పవర్ తో స్ట్రాంగ్ గా రన్ అయ్యి .. రూ.60 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో నిన్న అంటే జూలై 14 న రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మంచి రివ్యూలు, రేటింగ్ లు పడ్డాయి. మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు కానీ రెండో రోజు, మూడో రోజు ఓకే అనిపించింది.కానీ ఆ తర్వాత ఆ జోరు చూపించలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.25 cr
సీడెడ్
0.15 cr
ఆంధ్ర
0.20 cr
ఏపి + తెలంగాణా
0.60 cr
‘నాయకుడు’ (Nayakudu) సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.1.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ ఫుల్ రన్లో ఈ మూవీ కేవలం రూ.0.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ప్రమోషన్ చేసి రిలీజ్ చేసి ఉంటే.. ఇక్కడ కూడా ఈ మూవీ బాగా ఆడుండేది అనడంలో సందేహం లేదు.