Nayanathara, Vignesh: హాలిడే వెకేషన్ లో రచ్చ చేస్తున్న నయనతార.. ఫోటోలు వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో మునిగి తేలిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ జంట కొన్ని సంవత్సరాలు పాటు పీకల్లోతు ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఈ విధంగా వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. వివాహం తర్వాత హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లిన ఈ జంట సమయం దొరికినప్పుడల్లా విదేశీ పయనమవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా మరోసారి నయనతార దంపతులు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. గత రెండు రోజుల క్రితం విగ్నేష్ నయనతారతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నా భార్యతో కలిసి బార్సిలోనా వెళ్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ జంట స్పెయిన్ లోని బార్సిలోనాలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వీధులలో చక్కర్లు కొడుతూ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విగ్నేష్ శివన్ నయనతారతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఈ ఫోటోలలో నయనతారను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. బార్సిలోనా వీధులలో ఈ అమ్మడు పైన జాకెట్ విప్పి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మెడలో పసుపు తాడుతో ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఒకసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు పెళ్లికి ముందు నయనతార నిండుగా దుస్తులు ధరించి చూడముచ్చటగా ఉండేది, పెళ్లయిన తర్వాత ఈమె కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు ఉంది. మరి నయనతారలో ఇంత మార్పా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నయనతార మెడలో ఇప్పటికి పసుపు తాడు ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus