స్టార్ హీరోలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసిన నయన్

హీరోయిన్ గా పదమూడేళ్ళ సుదీర్ఘ ప్రయాణం నయనతారది. ఏకంగా స్టార్ హీరోలతో కెరీర్ స్టార్ చేసిన నయన్ తమిళంలో శరత్ కుమార్, రజనీకాంత్, సూర్య, అజిత్ వంటి హీరోల సరసన నటించగా తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. అయితే నటనకు సెలవన్న నయన్ రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి సీనియర్ హీరోలకు నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసింది.తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయినా ‘రాజా రాణి’ మొదలు నయన్ సినిమాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తనీ ఒరువన్, నానుమ్ రౌడీదాన్ వంటి సినిమాల్లో యువ హీరోల సరసన నటిస్తూనే తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోన్న నయన్ ‘అనామిక’, ‘మాయ’ సినిమాల రూపేణా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతోంది.

ఇన్నేళ్ల కెరీర్ లో చిరంజీవి, పవన్ లతో జతకట్టని నయన్ వారి సినిమాల కోసం సంప్రదించగా పలు కారణాలు జూపి వెనక్కు పంపేసిందట. దాన్నిబట్టి నయన్ తీరును అర్థం చేసుకోవచ్చంటున్నారు నయన్ బాధితులైన దర్శక నిర్మాతలు. వెంకీ వల్ల ‘బాబు బంగారం’ సినిమాలో నటించింది కానీ లేకపోతే అదీ జరిగేది కాదట. సీనియర్ హీరోల సరసన నటించిన అనుభవాన్ని బట్టి అక్కడ పాటల్లో గ్లామర్ ఒలకబోయడం తప్ప చేసేదేమీ ఉండదన్నది నయన్ పాయింట్. అందుకనే కార్తీ అగ్ర హీరోలకు శెలవు చెప్పకనే చెప్పింది ఈ భామామణి. ప్రస్తుతం ‘డోరా’ అనే హారర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నయన్ శివకార్తికేయన్, అథర్వ వంటి తమిళ యువ హీరోలతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus