Nayanthara: ఆ విషయంలో మారకపోతే నయన్ కు నష్టమేనా?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. నయనతార ఏదైనా సినిమాలో నటించాలంటే 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ చెల్లించాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అదే సమయంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో ఏ హీరోయిన్ పై లేని స్థాయిలో నయన్ పై విమర్శలు ఉన్నాయి. ఎంతమంది రిక్వెస్ట్ చేసినా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

అయితే నయనతార నటించిన కనెక్ట్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంటర్వెల్ లేకుండా విడుదలవుతున్న ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. థియేటర్ల ఓనర్లలో చాలామంది ఈ సినిమా రిలీజ్ విషయంలో ఆసక్తితో లేరు. అయితే భర్త బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కూడా నయనతార ఆసక్తి చూపడం లేదు. మూవీ ప్రమోషన్స్ విషయంలో నయనతార మరీ ఇంత కఠినంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కనెక్ట్ మూవీకి నయనతార పాత్ర కీలకం కాగా సరైన ప్రమోషన్స్ లేకుండా సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే విఘ్నేష్ శివన్ కు భారీగా నష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నయనతార సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడం విషయంలో ఫ్యాన్స్ సైతం తెగ ఫీలవుతున్నారు. ఈ ఒక్క విషయంలో నయనతార మారాలని అభిమానులు సూచిస్తున్నారు. నయనతార ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కూడా కష్టమేనని కొంతమంది చెబుతున్నారు.

ఈ కామెంట్ల గురించి విఘ్నేష్ శివన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే నయనతార ప్రమోషన్ల విషయంలో ఇలా చేయడం వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతోంది. ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కిన కనెక్ట్ ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus