Nayanthara Engagement: ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ సిగ్గుపడిన నయన్!

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మొన్నామధ్య విఘ్నేష్ శివన్ ఇదే విషయంపై స్పందిస్తూ.. పెళ్లి ఖర్చుతో కూడుకున్న పని అని.. దానికోసం డబ్బులు దాచుకుంటున్నా అంటూ నెటిజన్లకు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. తొలిసారి విఘ్నేష్ శివన్ తో రిలేషన్షిప్ గురించి పబ్లిక్ గా ఆన్సర్ చేసింది నయనతార. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తోన్న ‘నెట్రికన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ఓ టీవీ షోలో పాల్గొంది. ఇందులో యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో తన ఎంగేజ్మెంట్ రింగ్ ను చూపిస్తూ సిగ్గుపడింది.

ఈ షోకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తొలిసారి నయనతార తన ప్రేమ విషయాలపై స్పందించడంతో ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. నయన్ తెలుగులో చివరిగా ‘సైరా’ సినిమాలో కనిపించింది. ఇప్పుడు మెగాస్టార్ నటిస్తోన్న ‘లూసిఫర్’ రీమేక్ లో ఆమెని ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus