సౌత్ ఇండియా లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత ఈమె ఎన్నో బిజినెస్ లను ప్రారంభించారు.
నయనతార 9స్కిన్ అనే స్కిన్ కేర్ బ్యూటీ ప్రాడెక్ట్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు బిజినెస్ తర్వాత ఈమె రైతుల నుంచి నేరుగా సహజ ఉత్పత్తులను విక్రయించే డివైన్ బడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ దంపతులు పెమీ9 అనే నాప్‌కిన్ బ్రాండ్ కూడా ప్రారంభించారు. ఇక ఈ బిజినెస్ అంతా కూడా చాలా మంచి సక్సెస్ కావడంతో ఇటీవల విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నయనతార తన భర్త గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా ప్రతి ఒక్కరు ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందని చెబుతారు కానీ ప్రతి మహిళా విజయం వెనుక పురుషుడు ఉంటాడు అనేది నిజమని అందుకు నేనే ఉదాహరణ అంటూ తన భర్త గురించి ఈమె ఎంతో గొప్పగా చెప్పారు.. తాను విగ్నేష్ ని కలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నానని ప్రతి విషయంలోనూ ఆయన వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారని నేనేం చేయాలో కూడా చెబుతున్నారని నయనతార తెలిపారు.
నేను ఇక్కడ ఉన్నాను అంటే అందుకు కారణం విగ్నేష్ అని నాలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా బయట పెట్టింది తనే అంటూ ఈమె తెలిపారు. నీలో ఇంత అర్హత ఉండి ఎందుకు ఈ పనులు చేయడం లేదు అంటూ ఆయన నన్ను ప్రశ్నించడమే కాకుండా పనులు చేయడానికి ప్రోత్సహించారు. ఆయనని కలవకముందు వరకు నా జీవితం ఒకలా ఉండేదని కలిసిన తర్వాత మరోలా మారిపోయింది అంటూ ఈ సందర్భంగా ఈమె (Nayanthara) తన భర్త గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!