Nayanthara: నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

నయనతార ఒకప్పుడు టీవిలో యాంకర్ గా చేసేది. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడంతోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. మొదట్లో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన నయనతార .. తాను నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అవ్వడంతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. తర్వాత ఊహించని విధంగా ఈమె ప్రేమ వ్యవహారాలతో కెరీర్ పై ఫోకస్ పెట్టలేదు. ఆ టైంలో ఈమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి.

ఫిట్ నెస్ కూడా కోల్పోయింది. అయితే తర్వాత విగ్నేష్ శివన్ ఈమె జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడం.. అతనితో ప్రేమలో పడడం.. ఈమె స్టైల్ ను మొత్తం అతను మార్చేసి.. కథా ప్రాధాన్యత కలిగిన స్క్రిప్ట్ లు ఎంపిక చేయడంతో ఈమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఈమె కెరీర్ ఇక ముగిసింది అనుకున్న టైంలో ఈమె బౌన్స్ బ్యాక్ అయ్యింది. విగ్నేష్ తో ఈమె ప్రేమాయణం కూడా అప్పుడే మొదలైంది.

మొత్తానికి 7 ఏళ్ల ప్రేమను.. పెళ్లి బంధంతో మరింత పటిష్టం చేసుకుని.. సినిమాల్లో కూడా బిజీగా రాణిస్తుంది ఈ అమ్మడు. అయితే ఊహించని విధంగా ఈమె ఓ బాంబ్ పేల్చింది. ఇటీవల ఓ సందర్భంలో పెళ్ళికి ముందు సైన్ చేసిన సినిమాలు అన్నీ పూర్తి చేసి, తన భర్త విగ్నేష్ తో స్థాపించిన బ్యానర్లో రూపొందే సినిమాల పై దృష్టి పెట్టాలని ఆమె భావిస్తున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి 5 ఏళ్ళ క్రితం విదేశాల్లో వ్యాపారాలు కూడా స్టార్ట్ చేశారు. అవి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. వాటి వ్యవహారాలు కూడా చూసుకోవాలి అని నయన్ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే సినిమాలకు ఆమె గుడ్ బై చెబుతున్నట్టు ఏమీ చెప్పలేదు. అయితే ఈ నిర్ణయాలు వింటుంటే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫ్యాన్స్ భవిస్తూ టెన్షన్ పడుతున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus