నయన్ మహేశ్ సినిమాలోనా..?

కొన్నేళ్ల కిందట నయనతార నటనకి ఎండ్ టైటిల్ పడ్డట్టే అనుకున్నారంతా. అనతికాలంలోనే అనూహ్యంగా రీ ఎంట్రీ ఇచ్చిన నయన్ మునుపటి కంటే బిజీ హీరోయిన్ గా మారి హీరోయిన్లందరికీ పోటీ ఇస్తోంది. నెం 1 అని చెప్పాల్సివస్తే గనక ఇప్పటికీ నయన్ పేరే ముందుంటుంది. తెలుగులో తగ్గించినా తమిళనాట వరుస సినిమాలు చేస్తున్న నయనతార సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తుందంటూ వార్తల్లోకి వచ్చింది. ఆ వేడి చల్లారకముందే మహేశ్ సినిమాలో తళుక్కున మెరవనుందని చెన్నై వర్గాలు సడి చేస్తున్నాయి.

విభిన్న కథలను స్పృశించే మురుగదాస్ దర్శకుడిగా మహేశ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా రకుల్ ఎంపికైంది. అయితే సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందట. ఇదే జరిగితే మహేశ్-నయనతార కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా అవుతుంది. కాగా మురుగదాస్ తో నయన్కిది రెండోది. ఇదిలా ఉంటే తమిళ, తెలుగు భాషల్లో ఒకే టైటిల్ పెట్టేందుకు చిత్ర బృందం నిర్ణయించిందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus