Nayanthara Marriage: అతడు బాయ్ ఫ్రెండ్ స్టేజ్ దాటేశాడు: నయన్

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు నయన్ ఎప్పుడూ తన పెళ్లి గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. రీసెంట్ గా విఘ్నేష్ మాత్రం తన పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటున్నానని ఫ్యాన్స్ కి చెప్పారు. ఇదిలా ఉండగా.. తాజాగా నయనతార ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడింది.

తన ఎంగేజ్మెంట్ రింగ్ ను చూపిస్తూ.. విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులు, తన కుటుంబ సభ్యులు మాత్రమే నిశ్చితార్ధానికి హాజరయ్యారని చెప్పింది. పెద్ద హడావిడిగా సంబరాలు చేసుకోవడం తనకు నచ్చదని.. అందుకే సింపుల్ గా ఫ్యామిలీ మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరిగిందని తెలిపింది. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని.. త్వరలోనేఉంటుందని .. ముహుర్తాలు కుదిరిన తరువాత చెబుతానని వెల్లడించింది. అభిమానులకు సమాచారం ఇస్తానని.. రహస్యంగా మాత్రం పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది.

విఘ్నేష్ తనకు కాబోయే భర్త అని.. బాయ్ ఫ్రెండ్ స్టేజ్ ఎప్పుడూ దాటేశాడని చెప్పుకొచ్చింది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కాబట్టి మీడియా ఫ్రెండ్స్ కూడా ఇకపై అలా రాస్తేనే బాగుంటుందని కోరింది. తన వ్యక్తిగత జీవితంలో ఏదీ దాచుకోలేదని చెబుతోంది. మీడియా కూడా తనకు అలాంటి గౌరవం ఇవ్వలేదని ఆమె మాట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus