Nayanthara: నయనతార ఒక్క యాడ్ రేమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం అవకాశాలు కోల్పోకుండా వరుస సినిమాలలో హీరోయిన్ పాత్రలలో అవకాశాలు అందుకుంటు దూసుకుపోతున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా షారుఖ్ ఖాన్ సరసన నటించిన జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార అనంతరం మరికొన్ని బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు నయనతార తీసుకున్నంత రెమ్యూనరేషన్ ఏ హీరోయిన్ కూడా తీసుకోలేదు. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి హీరోయిన్గా నయనతార గుర్తింపు పొందారు. అయితే ఈమె సినిమాలకు మాత్రమే కాదు ఏదైనా ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేయాలి అంటే కూడా భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈమె ఒక యాడ్ చేయడం కోసం కోట్లలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట కేవలం 50 సెకండ్స్ యాడ్ షూట్ చేయాలి అంటే నయనతార ఏకంగా ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం.

ఇలా యాడ్స్ చేయడానికి కూడా ఈ స్థాయిలో స్టార్ హీరోలు కూడా రెమ్యూనరేషన్ అందుకోలేదని చెప్పాలి. అలాంటిది నయనతార 50 సెకండ్లకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇలా నయనతార (Nayanthara) రెమ్యూనరేషన్ తెలిసి నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus