Nayanthara, Vignesh: నయన్‌ కపుల్‌కి గవర్నమెంట్‌ నోటీసులు!

సరోగసీ గురించి సీనియర్‌ నటి కస్తూరి ఇటీవల ఓ పోస్ట్‌ పెడితే.. నయనతార అభిమానులు అంతా ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. ఆమె నయనతార గురించే ఆ పోస్ట్‌ పెట్టింది అంటూ కోపం వ్యక్తం చేశారు. అయితే ఆమె అందుకన్నారో, ఇంకెందుకు అన్నారో తెలియదు కానీ.. ఇప్పుడు ఏకంగా నయనతార పిల్లల విషయంలో ప్రభుత్వమే ప్రశ్నిస్తోంది. అవును మీ పిల్లల సంగతి చెప్పండి అంటూ నయనతారను అడుగుతాం అంటూ తమిళనాడు మంత్రి ఒకరు స్పందించారు.

తాము తల్లిదండ్రులం అయ్యామంటూ ఆదివారం నయనతార, విగ్నేష్ శివన్ సోషల్‌ మీడియాలో తెలిపారు. ఇద్దరు కవల బాబులకు అమ్మానాన్నలం అయ్యాం అంటూ ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. అయితే నయనతార, విగ్నేష్ శివన్‌కు పెళ్లి అయ్యి నాలుగు నెలలే అయ్యింది. దీంతో ఇంత త్వరగా పిల్లలు పుట్టడం అసాధ్యం. పైగా నయన్ ఇటీవల కాలంలో ఎక్కడా గర్భవతిగా కనిపించలేదు. దీంతో నయనతార అద్దె గర్భం ద్వారా తల్లి అయ్యిందని స్పష్టమవుతోంది.

ఈ మొత్తం వ్యవహారంపై కొందరు పాజిటివ్‌గా రెస్పాండ్ అయితే, మరికొందరు ఆ జంటను విమర్శిస్తున్నారు. కారణం 2022 జనవరి నుండి అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం దేశంలో నేరం. గర్భం దాల్చలేని పక్షంలోనే ఈ పద్ధతికి అనుమతి ఇస్తారు. మరి నయన్, విగ్నేష్‌ చట్టప్రకారమే అలా పిల్లల్ని కన్నారా లేదా అనేది తెలియడం లేదు. దీంతో పిల్లల విషయంలో తమిళనాడు ప్రభుత్వం వివరాలు తెలుసుకోవాలని అనుకుంటోంది. అందుకే వారికి నోటీసులు కూడా పంపించారట.

సరోగసీ చట్టం ప్రకారం చూసుకుంటే.. ఆ జంటకు పెళ్ల‌యి ఐదు ఏళ్లు అయి ఉండాలి. ఆ ఐదేళ్లుగా సంతానం లేక‌పోయినా, బిడ్డ‌ను క‌న‌డంలో ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికైనా స‌మ‌స్య ఉన్నా… దాన్ని ధ్రువీక‌రిస్తూ వైద్యుల వ‌ద్ద అనుమ‌తి ప‌త్రం తీసుకుని ఉండాలి. ఆ తర్వాతే స‌రోగసీని ఆశ్ర‌యించాలి. ఐతే న‌య‌న్‌, విఘ్నేష్‌ల‌కు పెళ్ల‌యి నాలుగు నెల‌లే అయింది. అంతేకాకుండా వాళ్లు పిల్ల‌ల్ని క‌న‌డంలో ఇబ్బంది ఉన్న‌ట్లుగా ఎలాంటి స‌ర్టిఫికెట్ ప్ర‌భుత్వానికి సమ‌ర్పించ‌లేద‌ని వార్తలు వస్తున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus