Nazriya: ప్రేమ – పెళ్లి గురించి చెప్పిన నజ్రియా.. ఏమందంటే?

కథానాయిక నజ్రియా నజీమ్‌ – నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. అయితే వారి ప్రేమ వ్యవహారం ఎలా సాగింది, ఇంట్లో ఏమన్నారు అనేది మనకు తెలియదు. దీని గురించి ఫహాద్‌ ఎప్పుడూ చెప్పలేదు, నజ్రియా అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు ఇద్దరూ తెలుగు సినిమాలు చేస్తుండటంతో అందుబాటులోకి వచ్చారు. ‘అంటే సుందరానికి’తో నజ్రియా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రచారంలో పాల్గొంటోంది.

అందులోనే తన ప్రేమ గురించి, తమ పెళ్లి – ప్రేమ గురించి గురించి చెప్పింది. వివాహ బంధం విషయంలో కులమతాల పట్టింపులు ఉండకూడదని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. ప్రస్తుతం సమాజంలో మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. సొంత కులం /మతానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారన్న గ్యారెంటీ లేదని ప్రజలకు అర్థమవుతోంది. ఏ బంధానికైనా ప్రేమ ముఖ్యం. నా దృష్టిలో అన్నిటికంటే గొప్పది అదే.

మన పిల్లల తరానికైనా ఈ కుల, మతాల సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను. అని ప్రేమ గురించి మాట్లాడింది నజ్రియా. ఇక వారి ప్రేమ కథ గురించి చెబుతూ ఫహాద్‌తో నా కథలో మంచి డ్రామా ఉండాలని అనుకునే దాన్ని. కానీ నా కోరిక నెరవేరలేదు. మా పెళ్లి సాఫీగా జరిగిపోయింది. కుటుంబసభ్యులు ఓకే అనేయడం, మేం ఒక్కటి అయిపోవడం సులభంగా జరిగిపోయాయి. నేను, ఫహద్‌ ఇంట్లో ఉంటే కలిసి సినిమాలు చూస్తాం.

సినిమలు, నటన గురించి బాగానే చర్చించుకుంటాం అని చెప్పింది నజ్రియా. పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండి, వైవాహిక జీవితాన్ని ఆస్వాదించా. అయితే ఫహద్‌ మాత్రం ‘ఏంటి సినిమా కథలు వినవా’ అని అడుగుతుండేవాడు. ఆసక్తికరమైన కథ, మునుపెన్నడూ చేయని పాత్ర దొరికితే ఆ సినిమా చేయాలనుకునేదాన్ని. అలాంటి కథలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇప్పుడు కూడా అలాంటి పాత్ర ఎవరైనా చెబితే వెంటనే ఓకే చెప్పేస్తా అని చెప్పింది నజ్రియా.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus